ధర్మం కోసం చావడానికైనా సిద్దమే: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్
ధర్మం కోసం తాను చావడానికైనా సిద్దమేనని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రకటించారు. తాను చేసిన వీడియోను యూట్యూబ్ నుండి తొలగించారని రాజాసింగ్ వివరించారు. మునావర్ ఫరూఖీ షో ను ఎందుకు నిర్వహించారని రాజాసింగ్ ప్రశ్నించారు.
హైదరాబాద్: ధర్మం కోసం తాను చావడానికైనా సిద్దమని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రకటించారు.
మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనే విషయమై హైద్రాబాద్ డబీర్ పురా పోలీస్ స్టేషన్ లో రాజాసింగ్ పై కేసు నమోదైంది. ఈ విషయమై రాజాసింగ్ మంగళవారం నాడు అరెస్ట్ కావడానికి కొద్దిసేపు ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. తనపై ఎలాంటి చర్యలకు దిగినా కూడా తాను సిద్దంగా ఉన్నాని ఆయన తేల్చి చెప్పారు. హైద్రాబాద్ లో మునావర్ ఫరూఖీ షో నిర్వహించవద్దని హెచ్చరించినా కూడా షో నిర్వహించడాన్ని తప్పుబట్టారు.ఈ కార్యక్రమాన్ని నిర్వహించవద్దని తాను పోలీసులకు ముందే దండం పెట్టి కూడా వినలేదని రాజాసింగ్ గుర్తు చేశారు. రాముడిని కించపర్చిన వ్యక్తికి పోలీసులు ఎలా రక్షణ కల్పిస్తారని రాజాసింగ్ ప్రశ్నించారు.మునావర్ ఫరూఖీకి కౌంటర్ వీడియోలు చేస్తానని ముందే చెప్పానన్నారు. మునావర్ ఫరూఖీ పై రెండో భాగం వీడియోను త్వరలోనే అప్ లోడ్ చేస్తానని కూడా రాజాసింగ్ తేల్చి చెప్పారు.యాక్షన్ కు రియాక్షన్ ఉంటుందని రాజాసింగ్ చెప్పారు.
also read:మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్
తాను ఎవరి పేరును తీసుకొని వ్యాఖ్యలు చేయలేదని చెప్పారు. అయినా కూడా తనపై ఎలా కేసు నమోదు చేస్తారని రాజాసింగ్ ప్రస్తావించారు. మునావర్ ఫరూఖీ మాత్రం ఓ వర్గం దేవతలను కించపర్చారని ఆయన గుర్తు చేశారు. కానీ తాను మాత్రం ఎవరిని కూడా ఉద్దేశించి వ్యాఖ్యలు చేయలేదన్నారు. తాను ఏం చేశానని తన ఇంటి ముందు భారీగా పోలీసులను మోహరించారని రాజాసింగ్ ప్రశ్నించారు.
మునావర్ ఫరూఖీ కార్యక్రమం వద్దని చెప్పినా కూడా హైద్రాబాద్ లో ఈ షో నిర్వహించడాన్ని రాజాసింగ్ తప్పు బట్టారు. ఈ షో ను నిర్వహించిన ప్రభుత్వంపై రాజాసింగ్ విరుచుకు పడ్డారు. ధర్మం కోసం తాను తుదిశ్వాస వరకు పోరాటం చేస్తానని రాజాసింగ్ తేల్చి చెప్పారు.
మునావర్ ఫరూఖీపై సరైన భాషలోనే తాను సమాధానం చెప్పినట్టుగా రాజాసింగ్ చెప్పారు. మరో వైపు తాను ఏం మాట్లాడానో చెప్పాలని రాజాసింగ్ ప్రశ్నించారు. ఎవరి పేరును తీసుకొన్నానా చెప్పాలని రాజాసింగ్ అడిగారు. తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్టుగా రాజాసింగ్ స్పష్టం చేశారు. విడుదలైన తర్వాత తాను రెండో భాగం వీడియోను యూట్యూబ్ లో అప్ లోడ్ చేస్తానని రాజాసింగ్ స్పష్టం చేశారు. జరుగుతున్న పరిణామాలకే మంత్రి కేటీఆర్ బాధ్యత వహించాలని రాజాసింగ్ చెప్పారు. తనపై ఎన్ని కేసులు నమోదు చేసినా కూడా తగ్గేది లేదన్నారు.