ప్రభుత్వ వైద్యురాలిని వేధిస్తున్న టీఆర్ఎస్ లీడర్

bodhan trs leader tortured government doctor
Highlights

అధికార టీఆర్ఎస్ పార్టీ నాయకుడు తమను వేధిస్తున్నాడంటూ బోధన్ ప్రభుత్వాసుపత్రిలో పనిచేసే ఓ వైద్యురాలు పోలీసులకు ఆశ్రయించారు. ఆస్పత్రి సలహామండలి సభ్యుడైన సదరు లీడర్ వేధింపులను తట్టుకోలేక సిబ్బంది, ఇతర పార్టీల నాయకులతో కలిసి ఆమె ఆస్పత్రి ఎదుట ధర్నా చేపట్టారు. అతడిపై చర్యలు తీసుకోవాలని పోలీసులతో పాటు ఆస్పత్రి సూపరిండెంట్ కు ఫిర్యాదు చేశారు. 
 
వివరాల్లోకి వెళితే... నిజామాబాద్ జిల్లా బోధన్ ప్రభుత్వ హాస్పిటల్ లో సారిక అనే మహిళ గైనిక్ విభాగంలో వైద్యురాలిగా పనిచేస్తోంది. అయితే రెండు సంవత్సరాలుగా ఇదే హాస్పిటల్లో పనిచేస్తున్న తనపై సలహా మండలి సభ్యుడు జమీల్ సైబర్ బెదిరింపులకు దిగుతున్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేవలం తననే కాదు ఆస్పత్రిలోని మిగతా సిబ్బందిపై కూడా ఆయన జులుం ప్రదర్శిస్తున్నాడని పేర్కొంది. కులం పేరుతో దూషిస్తూ మహిళనని కూడా చూడకుండా అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు సారిక ఫిర్యాధులో పేర్కొంది.

అయితే ఈ విషయం తెలిసిన ఇతర పార్టీలు నేతలు జమీల్ కు వ్యతిరేకంగా వైద్యురాలితో కలిసి ఆస్పత్రి ఎదుటు ధర్నా నిర్వహించారు. వైద్యురాలిని కులం పేరుతో దూషించిన జమీల్ పై అట్రాసిటి కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు.

వైద్యురాలు సారిక ఇచ్చిన ఫిర్యాదుతో టీఆర్‌ఎస్‌ నేత జమీల్‌ సైబర్‌పై కేసు నమోదు చేసినట్లు బోధన్ పోలీసులు తెలిపారు. ప్రభుత్వ వైద్యురాలి విధులకు ఆటంకం కల్పించడం, కులం పేరుతో దూషించడం, అవమానపర్చడం పట్ల సెక్షన్‌ 294,186,290ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అట్రాసిటీ కేసు కూడా నమోదు చేసినట్లు, ఈ వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

loader