హైదరాబాద్: ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బోధన్ ఎమ్మెల్యే షకీల్ బుధవారం నాడు తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ తో  భేటీ అయ్యారు.ఈ భేటీపై రాజకీయంగా ప్రాధాన్యత నెలకొంది. 

గత నెల 12వ తేదీన బోధన్ ఎమ్మెల్యే షకీల్  నిజామాబాద్ ఎంపీ  ధర్మపురి అరవింద్ ను కలిశారు. ఆ సమయంలో  షకీల్ పార్టీ మారుతారని పెద్ద ఎత్తున ప్రచారం సాగింది.మంత్రి పదవి రాలేదనే కారణంగా ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టుగా  ప్రచారం జరిగింది. అయితే మరునాడే షకీల్ యూటర్న్ తీసుకొన్నారు.

తన నియోజకవర్గంలో అభివృద్ది పనులకు సంబంధించి ఎంపీ  ధర్మపురి అరవింద్ తో భేటీ అయినట్టుగా షకీల్ ప్రకటించారు. తాను పార్టీ మారడం లేదన్నారు. ఆ తర్వాత టీఆర్ఎస్ నేతలతో షకీల్ భేటీ కాలేదు.

బుధవారం నాడు  మంత్రి కేటీఆర్ తో షకీల్ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకొంది. ఏ కారణంతో అరవింద్ ను కలవాల్సి వచ్చిందో మంత్రి కేటీఆర్‌తో షకీల్ వివరించే అవకాశం ఉందని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.

నిజామాబాద్ ఎంపీ అరవింద్ ను కలిసిన  తర్వాత ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌తో సమావేశమైనట్టుగా అప్పట్లో ప్రచారం సాగింది. ఆ తర్వాతే షకీల్ యూటర్న్ తీసుకొన్నారనే ప్రచారం కూడ సాగింది. 


 

బాద్ జిల్లా బోధన్ ఎమ్మెల్యే షకీల్ బుధవారం నాడు తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ తో  భేటీ అయ్యారు.ఈ భేటీపై రాజకీయంగా ప్రాధాన్యత నెలకొంది.