24గంటలుగా కనిపించకుండా పోయి రాష్ట్రమంతా సంచలనం సృష్టించిన నల్లగొండ టూటౌన్ సిఐ వెంకటేశ్వర్లు దొరికిండు. నిన్నటి నుంచి సిఐ ఎటు పోయిండా? అని ఇటు పోలీసు వర్గాలు.. అటు సిఐ కుటుంబ సభ్యులు భయాందోళనతో వెతికారు. తీరా 24 గంటల తర్వాత నల్గొండ జిల్లా సిఐ వెంకటేశ్వర్లు ఆచూకీ ఎట్టకేలకు లభ్యమైంది.

గుంటూరు జిల్లా బాపట్ల మండలం సూర్యలంకలో సీఐ ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. సీఐ వెంకటేశ్వర్లు మారుపేరుతో రిసార్ట్స్ తీసుకుని ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఎంతో చాకచక్యంగా వ్యవహరించిన నల్గొండ పోలీసులు... సీఐ వెంకటేశ్వర్లును పట్టుకున్నారు. సీఐ ఆచూకీ లభించిన విషయాన్ని ఐజీ స్టీఫెన్‌రవీంద్ర ధృవీకరించారు.

మానసిక ప్రశాంతత కోసమే తాను సూర్యలంకకు వచ్చానని సీఐ చెప్పుకొచ్చారు. సీఐతో కలిసి పోలీస్ బృందం బాపట్ల నుంచి నల్గొండకు బయలుదేరింది. . మరికొద్ది గంటల్లో డిఐజీ ముందుకు సిఐ వెంకటేశ్వరావును ప్రవేశపెట్టనున్నారు జిల్లా పోలీసు అధికారులు.

సంఛలనం సృష్టించిన నల్గొండ టూటౌన్ సిఐ మిస్సింగ్ మిస్టీరి వీడిపోయింది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి సిఐ ఆచూకి కనిపెట్టారు. మాడ్గులపల్లి పోలీసు స్టేషన్ లో సిమ్ అప్పగించిన తర్వాత ఒక కారులో సిఐ మిర్యాలగూడ వైపు వెళ్లిపోయారు. అయితే టోల్ గేట్ వద్ద సీసీ పుటేజ్ పరిశీలించి సిఐ వెళ్లిన ప్రదేశాన్ని కనిపెట్టారు. గుంటూరు జిల్లా బాపట్లలో మండలం సూర్యవంకలోని ఓ ప్రైవేట్ రిసార్ట్ లో వెంకటేశ్వరావును పట్టుకున్నారు పోలీసు అధికారులు. జిల్లా ఉన్నతాధికారుల వత్తిడి వల్లనే మనస్థాపానికి గురైన సిఐ వెంకటేశ్వర్లు మాయమైపోయినట్లు చెప్పారు. గుంటూరు జిల్లా బాపట్ల మండలం సూర్యలంకం లో మారు పేరుతో రిసార్ట్స్ తీసుకోని తలదాచుకున్నారు సిఐ వెంకటేశ్వర్లు. ఆయనను గుర్తించి వలపన్ని పట్టుకున్నారు నల్గొండ పోలీసులు.
నల్లగొండ మున్సిఫల్ ఛైర్మెపర్సన్ బొడ్డుపల్లి లక్ష్మీ భర్త,కాంగ్రెస్ నేత భొడ్డుపల్లి శ్రీనివాస్ హత్యలో ఆరుగురి నిందితులకు బెయిల్ రావడం,మరియు తల మొండెం వేరు చేసిన పాలకూరి రమేష్ హత్య ఈ రెండు హత్యలలో సిఐ వెంకటేశ్వరావు పై అధిక పని భారం ఉన్నట్లు పోలీసు పెద్దలు గుర్తించారు. రాజకీయ ఒత్తిడి మరియు ఉన్నతాధికారులు  సిఐని మందలించడంతోనే మనస్థాపానికి గురై అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది.