Asianet News TeluguAsianet News Telugu

కృష్ణా నదిలో మరో పడవ ప్రమాదం

ఇటీవల తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన బోటు ప్రమాద విషాదం నుండి తేరుకోకముందే తెలంగాణలో అలాంటి ప్రమాదమే మరోటి జరిగింది. కృష్ణా నదిలో ఓ  ఇంజన్ బోటు పరిమితికి మించి ప్రయాణికులను తీసుకువెళ్తూ ప్రమాదానికి గురయ్యింది. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణాపాయం సంభవించలేదు. కానీ తరచూ ఇలా జరుగుతున్న బోటు ప్రమాదాలు ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఆందోళనను సృష్టిస్తున్నాయి.   

boat accident in krishna river

ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా నదుల్లో వదర నీరు చేరి ఉదృతంగా ప్రవహిస్తున్న విషయం తెలిసిందే. అయితే నిన్న తొలి ఏకాదశిని పురస్కరించుకుని నాగర్ కర్నూల్ జిల్లా అమరగిరి వద్ద గల ఓ గుడికి వెళ్లేందుకు భక్తులు పుష్కర ఘాట్ నుండి ఓ బోటులో బయలుదేరారు. అయితే ఆ బోటులో సామర్థ్యానికి మించి ప్రయాణికులు ఎక్కారు. దీంతో బోటు నదిలో కొద్దిగా ముందుకు వెళ్లగానే బోల్తా పడింది.

అయితే ఈ బోటు బోల్తాపడిన ప్రాంతంలో లోతు ఎక్కువగా లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదాన్ని గమనించిన ఒడ్డున ఉన్నవారు వెంటనే అప్రమత్తమైన బోటు కింద చిక్కుకున్న ప్రయాణికులను కాపాడారు. దీంతో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. అయితే ఇదే ప్రమాదం నదిలో కాస్త ముందుకు వెళ్లాక జరిగితే ఘోరంగా ఉండేదని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

అయితే నదుల్లో ఇలా ఇష్ట్ం వచ్చినట్లు కెపాసిటీకి మించి ప్రయాణికులను తీసుకువెళ్లవద్దని నిబంధనలున్నా వాటిని పట్టించుకునేవారే లేరు. అయితే ఇటీవల కురిసిన వర్షాలకు ఉప్పొంగి ప్రవహిస్తున్న నదుల్లో మర బోట్లపై ప్రయాణం సురక్షితం కాదని ఇప్పటికే జరిగిన అనేక ప్రమాదాలు నిరూపించాయి. అధికారులు కూడా ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఈ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.  

Follow Us:
Download App:
  • android
  • ios