ఐడీఏ బొల్లారంలోని ఫార్మా కంపెనీలో పేలుడు.. 15 మందికి గాయాలు
ఐడీఏ బొల్లారంలో ఉన్న ఓ ప్రైవేట్ ఫార్మాస్యూటికల్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 15 మందికి గాయాలు అయ్యాయి. ఇందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
సంగారెడ్డి జిల్లా పరిధిలో ఉన్న ఐడీఏ బొల్లారంలో శనివారం రాత్రి భారీ ప్రమాదం జరిగింది. ప్రైవేటు ఫార్మాస్యూటికల్ కంపెనీలో రియాక్టర్ పేలడంతో మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో 15 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీనిపై సమాచారం అందగానే ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి.
తాగుడుకు బానిసై భార్యతో గొడవ.. నాలుగు నెలల గర్భిణీకి నిప్పంటించి, కుమారుడితో పరారైన భర్త.
మూడు ఫైర్ ఇంజన్లు తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి క్షతగాత్రలను హాస్పిటల్ కు తీసుకెళ్లారు. ప్రస్తుతం వారతా మమత మెడికల్ కాలేజీ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. బాధితులందరికీ 60 శాతానికి పైగా గాయాలు అయ్యాయి. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. అమర్ ల్యాబ్స్ లో ఈ ఘటన జరిగింది. రియాక్టర్ పేలుడు కారణంగా సంభవించిన ఈ అగ్నిప్రమాదం చేసిన నష్టం ఎంతో ఇంకా అంచనా వేయలేదు.
నిజామాబాద్ జిల్లాలో ఘోర ప్రమాదం.. ఆర్టీసీ బస్సు ఢీ కొనడంతో బైక్ పై నుంచి పడి యువకుడు మృతి..
కాగా.. ఈ అగ్నిప్రమాదం వల్ల కిలో మీటరు వరకు పొగలు వ్యాపించాయి. ఈ ఘనటపై బొల్లారం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. మెహదీపట్నంలోని ఓ అపార్ట్ మెంట్ కూడా అగ్నిప్రమాదం జరిగింది. దీని వల్ల ఎవరికీ గాయాలు కానప్పటికీ.. స్థానికులు భయాందోళన కు గురయ్యారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ మంటలు చెలరేగాయని తెలుస్తోంది. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు మొదలుపెట్టారు.