పోస్టాఫీసులపై సిబిఐ దాడులు భారీగా నల్లధనం వెలుగలోకి ?

సురక్షితమైన పెట్టుబడులకు.. చిన్న మొత్తాలను పొదుపు చేయడానికి పోస్టాఫీసులే పెద్ద దిక్కు.. నల్ల ధనం కూటబెట్టిన అక్రమార్కులు ఇప్పుడు ఆ పోస్టాఫులను కూడా వదలడం లేదు.

ఎవరికి అనుమానం రాకుండా పోస్టాఫీసుల్లో భారీగా నల్లధనాన్ని వివిధ మార్గాల ద్వారా వైట్ మనీ చేయడానికి ప్రయత్నిస్తున్నారు.

నగరంలోని చాలా పోస్టాఫీసుల్లో ఈ దందా కొనసాగుతున్నట్లు సిబిఐ వెంటనే రంగంలోకి దిగింది.

గురువారం సిబిఐ అధికారులు నారాయణగూడ పోస్టాఫీసులో సోదాలు నిర్వహించగా రూ.40 లక్షలు పట్టుబడ్డాయి. దీనిపై అధికారులు విచారణ జరుపుతున్నారు. ఈ నెల 8 నుంచి పోస్టాఫీసులలో జరిగిన లావాదేవీలపై కూడా ఆరా తీస్తున్నారు. పోస్టాఫీస్ సేవింగ్స్ స్కీమ్ లో భారీగా బ్లాక్ మనీ డిపాజిట్ అయినట్లు తెలుస్తోంది.

నగరంలోని దాదాపు 10 పోస్టాఫీసుల్లో సీబీఐ దాడులు కొనసాగుతున్నాయి. దాడులకు సంబంధించి పూర్తి సమాచారం ఇంకా వెలుగులోకి రాలేదు.