Asianet News TeluguAsianet News Telugu

డబ్బుల వర్షం అంటారు.. దోచేస్తారు: పూజల కోసం ఏకంగా యువతిని...?

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన చిత్తూరు జిల్లా మదనపల్లె ఘటన మరువక ముందే తెలంగాణలోని పెద్దపల్లిలో ఇదే తరహా ఘటన వెలుగు చూసింది. క్షుద్రపూజల పేరుతో మోసం చేస్తున్న నలుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు

black magic worship in peddapally district ksp
Author
Peddapalli, First Published Feb 10, 2021, 9:17 PM IST

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన చిత్తూరు జిల్లా మదనపల్లె ఘటన మరువక ముందే తెలంగాణలోని పెద్దపల్లిలో ఇదే తరహా ఘటన వెలుగు చూసింది. క్షుద్రపూజల పేరుతో మోసం చేస్తున్న నలుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.

మహారాష్ట్రకు చెందిన క్షుద్రపూజల ముఠా జిల్లాలో తిరుగుతూ ప్రజలను మోసం చేస్తోంది. మహిళలతో బారిష్ పూజ చేస్తే డబ్బుల వర్షం కురుస్తుందంటూ ప్రచారం చేస్తూ అమాయక ప్రజలను బురుడీ కొట్టిస్తోంది.

ఈ నేపథ్యంలో డబ్బు, బంగారం ఆశ చూపి ఈ పూజల కోసం దివ్య అనే యువతిని కొనుగోలు చేసేందుకు సదరు ముఠా ప్రయత్నం చేసింది. విషయం పోలీసులు అప్రమత్తమై వారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులను రాజేందర్, కుమార్, మల్లమ్మ, సరితలుగా గుర్తించారు. 

ఈ ముఠా బారిష్ పూజతో డబ్బులు కురిసేలా చేసి అమాయకుల నుంచి లక్షలాది రూపాయలు దోపడి చేస్తున్నట్లు పోలీసులు దర్యాప్తులో తేలింది. బారిష్‌లా నిధులు కురిసేందుకు ముందుగానే ఈ ముఠా సభ్యలు ఓ సెట్ ఏర్పాటు చేస్తారని... అనంతరం రసాయనాలతో వర్షం కురిసేలా ఏర్పాటు చేస్తారని చెప్పారు.

ఈ కెమికల్స్ కలయికతో వర్షం‌తో పాటు డబ్బులు కురిసేలా మాయ చేస్తారని తెలిపారు. బారిష్ పూజ అనేది మోసమని .. క్షుద్రపూజల పేరుతో ఎవరైనా వస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios