తెలంగాణలో విజయ సంకల్పయాత్రలు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో విజయ సంకల్ప యాత్రలను బీజేపీ రేపు ప్రారంభించనుంది. పలువురు బీజేపీ అగ్రనేతలు ఈ యాత్రలను ప్రారంభించనున్నారు.
హైదరాబాద్: తెలంగాణలో రాష్ట్రంలో ఐదు ప్రాంతాల నుండి విజయ సంకల్ప యాత్రలను ప్రారంభిస్తున్నట్టుగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి ప్రకటించారు. సోమవారం నాడు హైద్రాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.నాలుగు యాత్రలు రేపు ప్రారంభం కానున్నాయి. మేడారం జాతర నేపథ్యంలో ఐదో యాత్ర ప్రారంభమయ్యే తేదీని రెండు మూడు రోజుల్లో ప్రకటించనున్నట్టుగా కిషన్ రెడ్డి ప్రకటించారు.
కృష్ణా విజయ సంకల్ప యాత్ర, రాజరాజేశ్వరి, భాగ్యలక్ష్మి, కొమరం భీమ్, భద్రకాళీ విజయసంకల్పయాత్రలను నిర్వహిస్తున్నట్టుగా కిషన్ రెడ్డి వివరించారు. భద్రకాళీ విజయ సంకల్ప యాత్ర రేపు ప్రారంభించడం లేదన్నారు. మిగిలిన నాలుగు యాత్రలను రేపు ప్రారంభించనున్నట్టుగా కిషన్ రెడ్డి వివరించారు.
also read:బంతి స్పీకర్ కోర్టులోకి: తుది విచారణకు టీడీపీ, వైఎస్ఆర్‌సీపీ రెబెల్ ఎమ్మెల్యేల గైర్హాజర్
కృష్ణా విజయ సంకల్ప యాత్రను ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని కృష్ణా గ్రామం నుండి ప్రారంభించనున్నట్టుగా ఆయన తెలిపారు. మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గాల గుండా ఈ యాత్ర సాగుతుందని మంత్రి చెప్పారు.ఈ యాత్రను కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాలా ప్రారంభించనున్నారన్నారు.
కొమరం భీమ్ విజయ సంకల్ప యాత్ర ముథోల్ లో ప్రారంభం కానుంది. నిజామాబాద్ జిల్లాలోని బోధన్ లో యాత్ర ముగియనుంది. ఈ రూట్ లోని మూడు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో ఈ యాత్ర సాగుతుందని కేంద్ర మంత్రి తెలిపారు. ఈ యాత్రను అసోం సీఎం హిమంత బిశ్వశర్మ ప్రారంభిస్తారని చెప్పారు.
భాగ్యలక్ష్మి విజయ సంకల్ప యాత్ర భువనగరి, మల్కాజిగిరి, హైద్రాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాలను కవర్ చేయనుంది. ఈ యాత్రను గోవా సీఎం ప్రమోద్ సావంత్ ప్రారంభించనున్నారని ఆయన తెలిపారు.
also read:ఢిల్లీకి పవన్ కళ్యాణ్: ఆ తర్వాతే అభ్యర్థుల ప్రకటన?
రాజరాజేశ్వరి విజయ సంకల్పయాత్ర కరీంనగర్, మెదక్, జహీరాబాద్, చేవేళ్ల నాలుగు పార్లమెంట్ స్థానాల పరిధిలో సాగనుంది.ఈ యాత్రను కేంద్ర మంత్రి బీఎల్ వర్మ ప్రారంభించనున్నారని ఆయన చెప్పారు.
also read:గూగుల్ ఉద్యోగికి 300 శాతం వేతనం పెంపు: ఎందుకో తెలుసా?
భద్రకాళీ విజయ సంకల్ప యాత్ర భధ్రాచలం నుండి ములుగు వరకు ఈ యాత్ర సాగుతుంది.ఈ రూట్ లోని మూడు పార్లమెంట్ నియోజకవర్గాల గుండా యాత్ర సాగేలా పార్టీ నేతలు రూట్ మ్యాప్ ను సిద్దం చేసినట్టుగా కేంద్ర మంత్రి తెలిపారు. అయితే మేడారం జాతర నేపథ్యంలో ఈ యాత్ర ఎప్పుడు ప్రారంభించనున్నారనే దానిపై రెండు మూడు రోజుల్లో స్పష్టత ఇవ్వనున్నట్టుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు.