Asianet News TeluguAsianet News Telugu

కేసీఆర్‌కి సవాల్: చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయానికి చేరుకొన్న బండి సంజయ్

పాతబస్తీ చార్మినార్ లో భాగ్యలక్ష్మి ఆలయానికి బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ శుక్రవారం నాడు మధ్యాహ్నం 12 గంటలకు చేరుకొన్నారు.

BJP Telangana state president bandi sanjay reaches bhagyalaxmi temple lns
Author
Hyderabad, First Published Nov 20, 2020, 12:17 PM IST


హైదరాబాద్: పాతబస్తీ చార్మినార్ లో భాగ్యలక్ష్మి ఆలయానికి బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ శుక్రవారం నాడు మధ్యాహ్నం 12 గంటలకు చేరుకొన్నారు.

జంట నగరాల్లో వరద సహాయం నిలిపివేయాలని ఈసీకి తాను లేఖ రాసినట్టుగా ప్రమాణం చేసేందుకు రావాలని సీఎం కేసీఆర్ కు బండి సంజయ్ సవాల్ చేసిన విషయం తెలిసిందే. ఈ సవాల్ కు  అనుగుణంగా ఆయన చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయానికి చేరుకొన్నారు.


హైద్రాబాద్ లో వరద సహాయం నిలిపివేయాలని ఈసీకి తాను లేఖ రాసినట్టుగా చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని ఆయన ప్రకటించారు.ఈ లేఖపై విచారణ జరిపించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

also read:ఈసీకి లేఖపై వివాదం:అజ్ఞాతంలోకి బండి సంజయ్, పాతబస్తీలో టెన్షన్

ఈ లేఖ విషయంలో తమపై టీఆర్ఎస్ చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు గాను బండి సంజయ్ భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రమాణం చేసేందుకు రావాలని కేసీఆర్ కు సవాల్ చేసిన విషయం తెలిసిందే.

also read:జిహెచ్ఎంసీ ఎన్నికలు: బండి సంజయ్ కు హైదరాబాద్ పోలీసు అనుమతి

బండి సంజయ్ ఈ ఆలయానికి వచ్చేందుకు పోలీసులు ఇవాళ ఉదయం అనుమతి ఇచ్చారు. అనుమతి రాకముందు బండి సంజయ్ అజ్ఞాతంలోకి వెళ్లారు. పోలీసులు అనుమతి ఇవ్వడంతో ఆయన బీజేపీ కార్యాలయం నుండి నేరుగా భాగ్యలక్ష్మి ఆలయానికి చేరుకొన్నారు.భాగ్యలక్ష్మి ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios