తెలంగాణను శ్రీలంక గా మారుస్తున్నారు: బండి సంజయ్

తెలంగాణ రాష్ట్రంలో  చోటు చేసుకుంటున్న పరిణామాలకు టీఆర్ఎస్, ఎంఐఎం లే కారణమని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. రాష్ట్రంలో మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ఈ పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు.

 BJP Telangana President Bandi Sanjay Serious Comments on MIM And TRS

హైదరాబాద్: తెలంగాణను శ్రీలంక మాదిరిగా మార్చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు.గురువారం నాడు కరీంనగర్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. మత విద్వేషాలు రెచ్చగొడుతూ రాష్ట్రంలో ఎంఐఎం ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతుందన్నారు.  శాంతి భద్రతల్ని కాపాడాల్సిన సీఎం  సమస్యల్ని సృష్టిస్తున్నాడని బండి సంజయ్ ఆరో.పించారు.  ఎంఐఎం , టీఆర్ఎస్ లు కలిసి రాష్ట్రంలో మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నాయని బండి సంజయ్ చెప్పారు.  అన్ని మతాల ప్రజలు బాగుండాలని తమ పార్టీ కోరుకుంటుందని బండి సంజయ్ తెలిపారు. ఈ విషయాన్ని ముస్లింలు కూడా గుర్తిస్తున్నారన్నారు. మునావర్ ఫరూఖీ ని హైద్రాబాద్ కు ఆహ్వానించడంలో మంత్రి కేటీఆర్ పాత్ర ఉందని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో నాలుగు రోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాలను తెలంగాణలోని మేధావులు, ప్రజలు ఆలోచించాలని బండి సంజయ్ కోరారు. 

ఢిల్లీలో లిక్కర్ స్కామ్  తో పాటు ఈడీ సహా పలు దర్యాప్తు సంస్థలు సోదాలు నిర్వహించిన సమయంలో సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల పేర్లు బయటకు వస్తున్నాయని బండి సంజయ్ ఆరోపించారు. తెలంగాణలో  కేసీఆర్ కుటుంబం అవినీతి విషయమై దేశ వ్యాప్తంగా ప్రచారం సాగుతుందన్నారు.  ఈ సమయంలో ప్రజల దృష్టిని మరల్చేందుకు గాను మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నాలు  చేస్తున్నారన్నారు.

గతంలో మునావర్  ఫరూఖీ  కామెడీ షో నిర్వహణ జనవరిలో నిర్వహించాలని భావిస్తే నిరసనలు జరిగిన విషయాన్ని బండి సంజయ్ గుర్తు చేశారు. అయితే ఈ నెలలో మునావర్ ఫరూఖీ కార్యక్రమాన్ని ఈ దఫా నిర్వహించారన్నారు.

కేసీఆర్ కుటుంబంపై వచ్చిన ఆరోపణల నుండి ప్రజల దృష్టిని మరల్చేందుకు గాను మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేశారని బండి సంజయ్ ఆరోపించారు. మునావర్ ఫరూఖీని హైద్రాబాద్ లో కార్యక్రమం నిర్వహించాలని ఎందుకు ఆహ్వానించారని బండి సంజయ్ ప్రశ్నించారు. మునావర్ ఫరూఖీని హైద్రాబాద్ కు రప్పించి మత విద్వేషాలు రగిల్చి ఆ నెపాన్ని బీజేపీపై వేయాలని టీఆర్ఎస్ కుట్ర పన్నిందన్నారు.

పాతబస్తీ ఎందుకు అభివృద్ది చెందడం లేదో చెప్పాలన్నారు. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీతో ఎంఐఎం అంటకాగుతుందన్నారు. తమ ఆస్తులను కాపాడుకొనేందుకు గాను ఎంఐఎం అధికార పార్టీతో అంటకాగుతుందన్నారు.  పాతబస్తీని న్యూ సిటీగా మారుస్తామని బీజేపీ ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.  ఈ విషయమై కూడా ముస్లిం మేథావుల్లో కూడా  చర్చ జరుగుతుందన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం  ఎంఐఎం మత విద్వేషాలను రెచ్చగొడుతుందని ఆయన ఆరోపించారు. 

also read:కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో తమిళిసై భేటీ:తెలంగాణలో పరిస్థితులపై నివేదిక

ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా తెలంగాణ సమాజంలో మార్పు వస్తుందన్నారు.. దీంతో ఈ యాత్రను అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో  ఘటనలు చోటు చేసుకుంటున్నాయన్నారు. టీఆర్ఎస్, ఎంఐఎంలు కుట్రలో భాగస్వామ్యం కావొద్దని ప్రజలను ఆయన కోరారు. ప్రజలంతా సంయమనం పాటించాలన్నారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios