బైంసాలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు.
ఆదిలాబాద్: బైంసాలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు.
సోమవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం ఒకే వర్గానికి కొమ్ముకాస్తోందన్నారు. హిందువులను హింసిస్తోందని ఆయన విమర్శించారు.
also read:కేసీఆర్‌కి కౌంట్‌డౌన్ ప్రారంభమైంది: బండి సంజయ్
పోలీసులను ఎంఐఎం చెప్పు చేతల్లో టీఆర్ఎస్ సర్కార్ పెట్టిందని ఆయన ఆరోపించారు. మహారాష్ట్ర నుండి బహిష్కరించిన వారే భైంసాలో ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై నమ్మకం లేకనే తాము ఈ విషయాలపై గవర్నర్ కు ఫిర్యాదు చేసినట్టుగా ఆయన చెప్పారు. ప్రగతి భవన్ లోకి చొరబడి సీఎంను ప్రశ్నిస్తామని ఆయన చెప్పారు.
తెలంగాణలో బలపడేందుకు బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్ సహా ఇతర పార్టీలకు చెందిన కీలక నేతలకు ఆ పార్టీ వల విసురుతోంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు ఆ పార్టీలో ఉత్సాహన్ని నింపాయి. దీంతో అధికార టీఆర్ఎస్ పై బీజేపీ చీఫ్ సంజయ్ దూకుడుగా విమర్శలు గుప్పిస్తున్నారు.
