హైదరాబాద్: మేయర్ పీఠాన్ని  బీజేపీ దక్కించుకోగానే పాతబస్తీలో సర్జికల్ స్ట్రైక్ చేస్తామని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పారు.

also read:కేసీఆర్‌కు బండి సంజయ్ కౌంటర్: మరోసారి లక్ష మాటలు చెప్పాడు

మంగళవారం నాడు జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలపై  బండి సంజయ్ ఘాటుగా స్పందించారు.

పాతబస్తీలో ఓట్లు వేసేది రోహింగ్యాలు, పాకిస్తాన్ వాసులని ఆయన ఆరోపించారు.  రోహింగ్యాల ఓట్లు లేని ఎన్నికలు జరగాలని ఆయన అభిప్రాయపడ్డారు.హిందూ సమాజాన్ని చీల్చే శక్తులను వ్యతిరేకిస్తున్నామన్నారు. హిందూ ధర్మం కోసం బీజేపీ అహర్నిశలు పనిచేస్తోందని ఆయన చెప్పారు. హిందూ ధర్మానికి వ్యతిరేకంగా పనిచేసినా తాము చూస్తూ ఊరుకోబోమని ఆయన తేల్చి చెప్పారు.

also read:ఓయూ వద్ద ఉద్రిక్తత, కేసీఆర్ ఒక్కడి వల్లే తెలంగాణ రాలేదు: బీజేవైఎం జాతీయాధ్యక్షుడు తేజస్వి సూర్య
హిందువుల మనోభావాల కోసం పనిచేస్తున్న బీజేపీని కొన్ని పార్టీలు మతతత్వపార్టీగా ముద్రవేస్తున్నాయని ఆయన ఆరోపించారు.ఒక వర్గం ఓట్ల కోసం పనిచేస్తున్న పార్టీలన్నీ  బీజేపీని మతతత్వపార్టీగా పిలుస్తున్నారని  ఆయన విమర్శించారు.

ఈ ఎన్నికల్లో ఎంఐఎంతోనే తమకు పోటీ అని బీజేపీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో జీహెచ్ఎంసీ పీఠాన్ని దక్కించుకోవాలని బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతోంది.