బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ క్వారంటైన్‌లోకి వెళ్లారు. గన్‌మెన్ కి కరోనా సోకడంతో వైద్యుల సలహా మేరకు ఆయన స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు.

హైదరాబాద్: బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ క్వారంటైన్‌లోకి వెళ్లారు. గన్‌మెన్ కి కరోనా సోకడంతో వైద్యుల సలహా మేరకు ఆయన స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు.హైద్రాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఇవాళ నిర్వహించిన ముఖ్య నేతల సమావేశానికి కూడ బండి సంజయ్ దూరంగా ఉన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ తరుణ్ చుగ్ సహా పలువురు నేతలు పాల్గొన్నారు. స్వీయ నిర్భంధంలో ఉన్న కారణంగా బండి సంజయ్ ఈ సమావేశానికి దూరంగా ఉన్నారు. 

also read:బీజేపీ నేతల కీలక సమావేశం: ఈటల చేరిక, భవిష్యత్తు కార్యాచరణపై చర్చ

బీజేపీ తెలంగాణ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ తరుణ్ చుగ్ సహా రాష్ట్ర నేతలు ఇవాళ మధ్యాహ్నం మాజీమంత్రి ఈటల రాజేందర్ తో భేటీ కానున్నారు. ఈ నెల 14న రాజేందర్ బీజేపీలో చేరనున్నారు. భవిష్యత్తు కార్యాచరణపై బీజేపీ నేతలు ఈటలతో చర్చించనున్నారు. ఈ నెల 12 లేదా 13 వ తేదీన ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నారు. 

భూకబ్జా ఆరోపణలతో మంత్రివర్గం నుండి ఈటల రాజేందర్ ను కేసీఆర్ భర్తరఫ్ చేశారు. దీంతో గత వారంలో రాజేందర్ టీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. తన అనుచరులతో రాజేందర్ రెండు రోజులుగా హుజూరాబాద్ లో సమావేశాలు నిర్వహించారు. హుజూరాబాద్ నుండి ఆయన నేరుగా హైద్రాబాద్ కు చేరుకొన్నారుు.