మెగా స్కాముల మెగా సీఎం కేసీఆర్: బండి సంజయ్ ఫైర్

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అక్రమ సంపాదన కోసం ప్రయత్నాలు చేస్తూ, రాష్ట్ర సంపదనంతటిని దోచిపెడుతున్నాడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ధ్వజమెత్తారు. కేసీఆర్‌ మెగా ముఖ్యమంత్రిగా, మెగా స్కాములు చేస్తున్నారని ఆయన విమర్శించారు.

BJP Telangana president Bandi Sanjay Fires on CM KCR

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అక్రమ సంపాదన కోసం ప్రయత్నాలు చేస్తూ, రాష్ట్ర సంపదనంతటిని దోచిపెడుతున్నాడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ధ్వజమెత్తారు. కేసీఆర్‌ మెగా ముఖ్యమంత్రిగా, మెగా స్కాములు చేస్తున్నారని ఆయన విమర్శించారు.

బిజేపీ ప్రతినిధి బృందం నేడు శనివారం గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్ తో రాజ్ భవన్ లో సమావేశమయ్యారు. భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..  కాళేశ్వరం ప్రాజెక్టులో నూతనంగా టెండర్లను పిలిచి, మెగా, నవయుగ, ప్రతిమ కంపెనీలకు కట్టబెట్టారని, ఇదంతా ప్యాకేజీ కోసమే చేసారని సంజయ్ మండిపడ్డారు. 

లాక్‌డౌన్‌ నిబంధనలకు నీళ్లొదులుతూ టెండర్లను పిలిచి సీఎం కేసీఆర్‌ తెలంగాణ రాష్ట్ర సంపదనంతా దొంగలకు దోచిపెడుతున్నారని ఆయన ఫైర్ అయ్యారు. పాత ప్రాజెక్టులను కూడా కేసీఆర్‌ తన ఖాతాలో వేసుకుంటున్నారని ఆయన ఎద్దేవా చేసారు.  

ఇకపోతే... లాక్‌డౌన్‌ కాలంలో సీఎం కేసీఆర్ ప్రెస్‌ మీట్‌లు అపహాస్యంగా మారయని, మీడియా ఆయనకు అనుకూలంగా ఉందని, అంతా ఆయన కంట్రోల్ లో ఉందని ఆయన భ్రమపడుతున్నారని బండి సంజయ్ అన్నారు. 

ఆయన అనుకుంటున్నట్టు మీడియా అంతా ఆయన చేసే మంచిపనుల వల్ల వెనుక లేదని, బెదిరించి మీడియాని తన గుప్పిట్లో నపెట్టుకుంటున్నారని బండి సంజయ్ దుయ్యబట్టారు. 

బీజేపీ ప్రాజెక్టులకు కానీ అభివృద్ధి కార్యక్రమాలకు కానీ వ్యతిరేకం కాదని, కేవలం కేసీఆర్‌ దర్శకత్వంలో జరుగుతున్న లూటీకి మాత్రమే బీజేపీ వ్యతిరేకమని సంజయ్ ఈ సందర్భంగా అన్నారు. 

మరో బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటీ సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ, కాళేశ్వరం ప్రాజెక్టులో జరుగుతన్న అవినీతిని, అక్రమాలపై గవర్నర్ కు ఫిర్యాదు చేశామని అన్నారు.  ఈ అక్రమాలపై సీబీసీఐడీ విచారణ జరపించాలని గవర్నర్‌ను కోరినట్లు ఆయన అన్నారు. ప్రతిపక్షాలపై అవాకులు చవాకులు పేలుతూ, ఇష్టానుసారంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడటం సరైనది కాదని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios