Asianet News TeluguAsianet News Telugu

యూ ఇడియట్: వాక్సినేషన్ మీద కేటీఆర్ ను దూషించిన బిజెపి నేత

కరోనా వ్యాక్సినేషన్ మీద కేంద్రంపై విమర్శలు చేసిన తెలంగాణ మంత్రి కేటీఆర్ మీద బిజెపి అధికార ప్రతినిధి ఖేమ్ చంద్ శర్మ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. యూ ఇడియట్ అంటూ కేటీఆర్ ను దూషించారు.

BJP spokesperson Khem Chand Sharma abuses KTR on vaccination drive
Author
Hyderabad, First Published Jun 8, 2021, 7:42 AM IST

న్యూఢిల్లీ: తెలంగాణ మంత్రి కెటి రామారావును బిెజపి అధికార ప్రతినిధి ఖేమ్ చంద్ శర్మ ఇడియట్ అంటూ దూషించారు. కరోనా వ్యాక్సిన్ విషయంలో కేటీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. లెట్స్ టాక్ వ్యాక్సినేషన్ యాష్ ట్యాగ్ తో మంత్రి కేటీఆర్ ఆదివారం సాయంత్రం ట్విట్టర్ చాట్ ప్రారంభించారు. 

ఆ ట్విట్టర్ చాట్ లో ఆ గొడవ జరిగింది.  తన చర్చలో కేటీఆర్ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. కేంద్రం వ్యాక్సిన్లకు ఆలస్యంగా ఆర్డర్లు ఇస్తోందని ఆయన తప్పు పట్టారు. భారత్ వ్యాక్సిన్ల హబ్ గా ఉన్న స్థితిోల ఇక్కడ డిమాండ్ - సరఫరా మంధ్య తేడా ఎందుకు ఉందని, దీనిపై పలు ప్రశ్నలు ముందుకు వస్తున్నాయని కేటీఆర్ అన్నారు 

మిగతా దేశాలు 2020 తొలి దశలో టీకాలకు ఆర్డర్లు ఇచ్చాయని, భారత ప్రభుత్వం ఆలస్యంగా నిద్ర లేచిందని కేటీఆర్ అన్నారు. దానిపై బిజెపి అధికార ప్రతినిధి ఖ్మ్ చంద్ శర్మ తీవ్రంగా స్పందించారు. "యూ ఇడియట్... ప్రజల్లో అసత్యాలు ప్రచారం చేస్తావా" అంటూ ఆయన మండిపడ్డారు. 

దాదాపు 17.5 కోట్ల మందికి వ్యాక్సిన్ తొలి డోసు ఇచ్చి భారత్ ప్రపంచంలోనే ముందు ఉందని, మొత్తంగా 22.37 కోట్ల మందికి టీకా ఇచ్చామని ఆయన కేటీఆర్ మీద విరుచుకుపడ్డారు 

ఖేమ్ చంద్ శర్మ ట్వీట్ కు కేటీఆర్ స్పందించారు. "సార్.. నేనూ మీలా మాట్లాడాగలను. కానీ అది మా సంస్కృతిలో లేదు. ఇజ్రాయిల్ జనాభాలో 60 శాతం మందికి, అమెరికా 40 శాతం మందికి వ్యాక్సిన్లు ఇచ్చాయి. దీన్ని బట్టి మనం ఎక్కుడున్నామో అర్థం చేసుకోవచ్చు. వాస్తవాలను జీర్ణించుకోలేని మీలాంటి వారికి ఈ విధమైన విషయాలు మింగుడు పడవు" అని కేటీఆర్ జవాబిచ్చారు. 

వ్యాక్సినేషన్ కోసం కేంద్రం కేటాయించిన రూ.35 వేల కోట్లు ఏమయ్యాయని కేటీఆర్ ప్రస్నించారు. భారత్ లో అందరికీ టీకా ఇవ్వాలంటే దాదాపు 272 కోట్ల డోసుల వ్యాక్సిన్ అవసరమవుతుందని ఆయన అన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios