హైదరాబాద్:  2023 ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ  అధికారంలోకి వస్తోందని మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. ఎంపీ ఎన్నికల్లో  బీజేపీకి మెరుగైన ఫలితాలను కట్టబెట్టిన తెలంగాణ ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

బుధవారం నాడు  హైద్రాబాద్‌లో జరిగిన బీజేపీ రాష్ట్ర పదాదికారుల సమావేశంలో ఆయన  మాట్లాడారు. అన్ని రంగాల వారిని బీజేపీలోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తామన్నారు. జూలై 6వ తేదీన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మోడీ ప్రారంభిస్తారన్నారు. 

ఆగష్టు 11వ తేదీ వరకు సభ్యత్వ నమోదు క్యాంపెయిన్  కొనసాగించనున్నట్టు ఆయన చెప్పారు.కుటుంబ రాజకీయాలకు కాలం చెల్లిందని ఆయన అభిప్రాయపడ్డారు.  కేసీఆర్‌కు తెలంగాణ అభివృద్ధిపై ధ్యాస లేదన్నారు.