మిషన్ భగీరథ వైస్ ఛైర్మన్, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిపై బిజెపి మహిళా మోర్చా రాష్ట్ర నాయకురాలు రవలి కుంచన ఫైర్ అయ్యారు. కేసిఆర్ కాళ్ల కాడ ఉండడం నా అదృష్టం అంటూ ప్రశాంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆమె స్పందించారు. కేసిఆర్ కాళ్ల దగ్గర ఉన్నా.. కేటిఆర్ కాళ్ల దగ్గర ఉన్నా పరవాలేదు అని ఎద్దేవా చేశారు. కానీ మిషన్ భగీరథ లో ఎంత అవకతవకలు జరుగుతున్నాయో కాగ్ నివేదిక బట్టబయలు చేసిన తర్వాత ఇంకా మిషన్ భగీరథ వైస్ ఛైర్మన్ గా కొనసాగే హక్కు వేముల ప్రశాంత్ రెడ్డికి లేదన్నారు. ముందు రాజీనామా చేసిన తర్వాత సిఎం కేసిఆర్ కాళ్ల దగ్గర ఉన్నా, కేటిఆర్ కాళ్ల దగ్గర ఉన్నా ప్రజలకు ఇబ్బందిలేదన్నారు. రవలి ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. చూడండి.