Asianet News TeluguAsianet News Telugu

Huzurabad bypoll:హుజూరాబాద్‌లో బీజేపీ ప్లాన్ ఇదీ


హుజూరాబాద్ అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల్లో అనుసరించిన వ్యూహాన్నే బీజేపీ మలు చేయనుంది.ఈ ఎన్నికల్లో విజయం  సాధించడం కోసం బీజేపీ సర్వ శక్తులు ఒడ్డుతోంది.

BJP plans to implement Dubbaka bypoll stratagy in Huzurabad bypoll
Author
Karimnagar, First Published Oct 10, 2021, 1:08 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

హుజూరాబాద్: దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల్లో అనుసరించిన వ్యూహాన్ని హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో అనుసరించాలని బీజేపీ నిర్ణయించింది. ఈ మేరకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.huzurabad bypoll ఎన్నికల్లో  విజయం సాధించడం కోసం bjp సర్వశక్తులను ఒడ్డుతోంది. ఈ స్థానంలో విజయం సాధించి trs ను దెబ్బతీయాలని కమల దళం భావిస్తోంది.హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలుపు సాధించడం కోసం బీజేపీ రాష్ట్ర అన్ని వ్యూహాలను అమలు చేయనుంది.

బీజేపీ అగ్రనేతల ప్రచారానికి వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. సామాజిక వర్గాలు, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా సీనియర్ నాయకులకు బాధ్యతలను అప్పగించింది బీజేపీ నాయకత్వం.

also read:Huzurabad Bypoll: టాప్‌లో ఈటల జమున, తర్వాత రాజేందర్.. చివరలో గెల్లు శ్రీనివాస్

మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలకు మున్సిపాలిటీలు, మండలాలకు ఇంచార్జీ బాధ్యతలను అప్పగించింది కమలదళం.  పోలింగ్ కేంద్రాల వారీగా కూడ బాధ్యులను నియమించనున్నారు. పార్టీ సీనియర్లు, రాష్ట్ర స్థాయి నేతలకు బాధ్యతలను అప్పగిస్తారు. ఆయా పోలింగ్ కేంద్రాల వారీగా ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చే అవకాశం ఉంది. ప్రత్యర్ధులకు అనుకూలంగా ఉన్న ఓటర్లను తమ వైపునకు ఎలా తిప్పుకోవాలనే విషయమై బీజేపీ నేతలు ప్లాన్ చేస్తున్నారు.

హుజూరాబాద్ నియోజకవర్గ సమన్వయ బాధ్యతలను మాజీ ఎంపీ జితేందర్ రెడ్డికి అప్పగించారు. హుజూరాబాద్ టౌన్‌కు raghunandan rao, హుజూరాబాద్ రూరల్ కి మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి, జమ్మికుంట రూరల్‌కి మాజీ ఎమ్మెల్యే ధర్మారావు, జమ్మికుంట టౌన్‌కి మాజీ ఎంపీ రమేష్ రాథోడ్, ఇల్లంతకుంట కు మాజీ ఎంపీ చాడ సురేష్ రెడ్డి, కమలాపూర్ కు మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, వీణవంకకు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డిలను బీజేపీ నాయకత్వం బాధ్యతలు అప్పగించింది.

కరోనా నేపథ్యంలో భారీ సభలు, రోడ్‌షోలపై ఈసీ ఆంక్షలు విధించిన నేపథ్యంలో దానికి అనుగుణంగా  బీజేపీ నాయకత్వం ప్రచార వ్యూహాన్ని సిద్దం చేసింది.దసరా తర్వాత బీజేపీ తెలంగాణ చీఫ్  bandi sanjay హుజూరాబాద్ అసెంబ్లీ స్థానంలో ప్రచారం నిర్వహించే అవకాశం ఉంది. వారం రోజుల క్రితమే ఆయన తొలి విడత పాదయాత్రను పూర్తి చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios