Huzurabad Bypoll: టాప్‌లో ఈటల జమున, తర్వాత రాజేందర్.. చివరలో గెల్లు శ్రీనివాస్

హుజరాబాద్ ఉపఎన్నిక ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్. ఈ ఎన్నిక కోసం నామినేషన్ల పర్వం ముగిసింది. నామినేషన్లలో అభ్యర్థులు సమర్పించిన వివరాల ప్రకారం అధిక ఆస్తులు కలిగిన్న జాబితాలో ఈటల జమున అగ్రస్థానంలో నిలిచారు. తర్వాతి స్థానాల్లో బీజేపీ అభ్యర్థి రాజేందర్, కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్, టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌లున్నారు.
 

etela jamuna richest candidate in huzurabad bypoll while gellu last in the list

కరీంనగర్: ప్రస్తుతం రాష్ట్రమంతా huzurabad by poll వైపే చూస్తున్నది. రాజకీయ పార్టీలన్నీ ఆ ఎన్నిక కేంద్రంగానే కార్యక్రమాలు చేపడుతున్నాయి. ఈ ఎన్నిక తర్వాత వచ్చేది అసెంబ్లీ ఎన్నికలే కావడంతో అటు అధికారపార్టీ trs, దుబ్బాక గెలుపు తర్వాత ఎలాగైనా మళ్లీ పట్టు నిలుపుకోవాలని bjp హోరాహోరీగా తలపడటానికి సిద్ధమవుతున్నాయి. congress కూడా బరిలో నిలిచింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఉనికి చాటుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నది. ఇక etela rajender చావో రేవో అన్నట్టుగా ప్రచారం చేస్తున్నారు. అందుకే ఈ ఎన్నికను పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ప్రచారానికి, ఓటర్లను ఆకర్షించుకోవడానికి ఎంత ఖర్చుపెట్టడానికైనా వెనుకడబోవడం లేదు.

హుజురాబాద్ ఉపఎన్నిక కోసం nominationల పర్వం ముగిసింది. తమ ఆస్తుల వివరాలు వెల్లడిస్తూ అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఈ ఆస్తుల వివరాలు ప్రస్తుతం ఆసక్తి పుట్టిస్తున్నాయి. వీటి ప్రకారం హుజురాబాద్ ఉపఎన్నిక బరిలో దిగబోతున్నవారిలో అత్యధిక ఆస్తులు ఈటల రాజేందర్ భార్య, జమున పేరిట ఉన్నాయి. తర్వాతి స్థానంలో ఈటల రాజేందర్ ఉన్నారు. కాగా, టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ చివరలో ఉన్నారు.

ఎప్పట్లాగే ఈటల రాజేందర్‌తోపాటు ఆయన భార్య కూడా నామినేషన్ వేశారు. బీజేపీ అభ్యర్థిగా రాజేందర్ బరిలోకి దిగనున్నారు. సాధారణంగా రాజేందర్ నామినేషన్ విజయవంతంగా దాఖలైన తర్వాత ఈటల జమున తన నామినేషన్ వెనక్కి తీసుకుంటుంటారు. దీంతో మొత్తం రూ. 43 కోట్లతో ఈటల జమున అధిక సంపన్న అభ్యర్థిగా హుజురాబాద్ బరిలో నిలిచారు. తర్వాతి స్థానంలో రూ. 16.12 కోట్లతో రాజేందర్ ఉన్నారు. తర్వాత కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ ఉన్నారు. చివరి స్థానంలో ఇక గెల్లు శ్రీనివాస్ మొత్తం ఆస్తుల విలువ రూ. 22లక్షలుగా అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఈటల జమున పేరిట మూడు వాహనాలు ఉండగా రాజేందర్‌కు సొంత వాహనం లేకపోవడం గమనార్హం. గెల్లు శ్రీనివాస్‌కూ సొంత వాహనం లేదని పేర్కొన్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios