TS BJP: త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కమల నాథులు వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటికే పార్టీ అధ్యక్షుడ్ని బీజేపీ పెద్దలు మార్చారు. అధికార బీఆర్ఎస్ ను ఎదుర్కొంటూ.. అధికారంలోకి రావడానికి బీజేపీ అధిష్టానం ఎలాంటి వ్యూహాలు రచించిందో తెలుసుకుందాం..
TS BJP: తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అధికార బీఆర్ఎస్.. ప్రతిపక్ష బీజేపీ దారిలోనే బీజేపీ ప్రయాణిస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా (BJP) దూకుడు పెంచింది. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత కాస్త డీలా పడ్డ తరుణంలో ఖమ్మం వేదికగా.. పార్టీ నేతలకు బూస్ట్ ఇచ్చేందుకు అగ్రనాయకత్వం రంగం సిద్ధం చేసింది.
ముచ్చట మూడో సారి అధికారంలో చేపట్టాలని బీఆర్ఎస్ ప్రణాళికలు రూపొందిస్తున్న తరుణంలో బీజేపీ ‘దూకుడు’ పెంచారు. అధికార, ప్రతిపక్ష పార్టీలను కట్టడి చేస్తూ.. ముందుకు సాగాలనీ, అధికార పార్టీ ఎమ్మెల్యేల భరతం పట్టాలని ఫిక్స్ అయినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అసలు తెలంగాణలో బీజేపీ ఏవిధంగా అడుగులేస్తోందో.. అధికారంలోకి రావడానికి బీజేపీ అధిష్టానం ఎలాంటి వ్యూహాలు రచించిందో? ఎలా ముందుకెళ్తోందనే విషయాలను తెలుసుకుందాం..
వ్యూహాత్మకంగా అడుగులు
తెలంగాణ గులాబీ పార్టీని గద్దె దించాలని, ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రానివ్వకూడదని రాష్ట్ర, కేంద్ర బీజేపీ నాయకత్వం ప్రయత్నాలు చేస్తోంది. అంతర్గతంగా బీఆర్ఎస్-బీజేపీ (BRS-BJP) మధ్య సత్సంబంధాలు ఉన్నాయనే టాక్ పక్కన బెడితే.. తెలంగాణ బీజేపీ నేతలు మాత్రం.. కేసీఆర్ ను సీఎం పీఠం నుంచి దించాలని ప్రయత్నిస్తున్నారు. ఆ దిశగానే ముందుకు అడుగులేస్తున్నారు. అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలు వైఫల్యాలను ఎండగట్టాలని జనాల్లోకి మరింత దూసుకెళ్లాలని ఫిక్సయ్యారు.
ఈ క్రమంలోనే జూన్-15న ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని బీజేపీ అధిష్టానం భావించింది. కానీ.. కొన్ని కారణాల వల్ల సభ జరగలేదు. పార్టీ నాయకత్వం కూడా మారడంతో మరి జోష్ మీద ఉన్న బీజేపీ.. జూలై-29న అదే ఖమ్మం (Khammam) గడ్డపై సభ నిర్వహించాలని గట్టిగా ముహూర్తం ఫిక్స్ చేసింది. ఈ భారీ బహిరంగ సభకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు.
ఇదే ఖమ్మం గడ్డపై బీఆర్ఎస్, కాంగ్రెస్ లు నిర్వహించిన బహిరంగ సభలు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఊహించిన దాని కంటే.. ఎక్కువ సక్సెస్ అయ్యాయి. దీంతో ఆ రెండు పార్టీలను మించి.. భారీ సభ ఏర్పాటు చేయాలని, భారీ ఎత్తున జనసమీకరణ చేయాలని తెలంగాణ బీజేపీ నాయకులు భావిస్తున్నారు. ఈ సభ వేదికగా బీఆర్ఎస్ పై బీజేపీ యుద్దం ప్రకటించేలా ఉంది. ఈ సభలో కేసీఆర్ సర్కార్ అవినీతిని బట్టబయలు చేయాలని కేంద్రమంత్రి అమిత్ షా భావిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే తెలంగాణ బీజేపీ నాయకులు పలు నివేదికలను సమర్పించినట్టు, వాటిని అమిత్ షా నిశితంగా షా పరిశీలించినట్లు సమాచారం. మొత్తానికి బీఆర్ఎస్‌పై బీజేపీ వార్ డిక్లర్ చేయనున్నట్లు స్పష్టమతుంది. ఆ దిశగానే కమలనాథులు వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నట్లు అర్థమవుతోంది.
ఇక వరుస పర్యటనలు..
ఇక ఆగస్ట్ 15 నుంచి వరుస కార్యక్రమంతో బీజేపీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించనున్నారు. ఈ పర్యటన చాలా వ్యూహాత్మకంగా సాగనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆస్తుల వివరాలను (ఆర్టీఐ యాక్ట్ ద్వారా) సేకరించాలని బీజేపీ నిర్ణయించింది. నియోజకవర్గాల్లో పర్యటించనున్నట్టు ఆ చిట్టా తీయాలని కమలనాథులు భావిస్తున్నారు. అలాగే.. రానున్న ఎన్నికల్లో మొత్తం 119 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించనున్నట్లు తెలిపింది. మొత్తానికి అమిత్ షా పర్యటనను విజయవంతం చేసి.. ఎన్నికల శంఖరావం పూరించాలని కమలనాథులు భావిస్తున్నారు.
కానీ.. ఎన్నికల సమయంలోనే అధ్యక్షుడిగా బండి సంజయ్‌ను పక్కనెట్టి కిషన్ రెడ్డికి పార్టీ పగ్గాలు అప్పజెప్పడంతో కొందరు నేతల్లో అసంత్రుప్తి నెలకొంది. ఈ తరుణంలో వారు కారెక్కుతారో.. హస్తంతో చేయి కలుపుతారో తెలియని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో అధికార బీఆర్ఎస్ కు పోటీ ఇవ్వాలంటే.. బీజేపీ ఓ రేంజ్ లో వర్కవుట్ చేయాల్సి ఉంటుంది. ఈ పరిస్థితులను అధిగమించి.. అధికార బీఆర్ఎస్ ఏ మేరకు ఎదుర్కొంటారో వేచి చూడాలి మరి.
