తెలంగాణ కోసం ఎందరో బలిదానాలు చేస్తే బాగుపడింది మాత్రం కేసీఆర్ కుటుంబమేనన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. తెలంగాణలో ఇండస్ట్రియల్ కారిడార్లు, మెగా టెక్స్‌టైల్ పార్క్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ మోడీ చలవేనని జేపీ నడ్డా చెప్పారు.
తెలంగాణ కోసం ఎందరో బలిదానాలు చేస్తే బాగుపడింది మాత్రం కేసీఆర్ కుటుంబమేనన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. నాగర్ కర్నూలులో ఆదివారం జరిగిన నవసంకల్ప సభలో నడ్డా పాల్గొని ప్రసంగించారు. అలంపూర్ జోగులాంబ అమ్మవారికి నమస్కారాలు అంటూ ఆయన తన ప్రసంగాన్ని ప్రారంభించారు. అలాగే తెలంగాణ సాధనలో అమరులైన వారికి నడ్డా నివాళులర్పించారు.
తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలు దు:ఖంతో వున్నారని నడ్డా అన్నారు. రాష్ట్రంలో కేసీఆర్, ఆయన కుమారుడు, కుమార్తె మాత్రమే సంతోషంగా వున్నారని దుయ్యబట్టారు. మోడీ పాలనలో దేశం పురోగమిస్తోందని.. తెలంగాణ అభివృద్ధి కోసం మోడీ ప్రభుత్వం కట్టుబడి వుందన్నారు. 9 ఏళ్ల మోడీ పాలనలో బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి అనేక చర్యలు చేపట్టారని జేపీ నడ్డా పేర్కొన్నారు. మోడీ ప్రభుత్వం 80 కోట్ల మంది ప్రజలకు రేషన్ అందిస్తోందన్నారు. ఆయన ప్రభుత్వం పేదలకు అంకితమని.. మోడీ అధికారంలోకి వచ్చాక పేదరికం పది శాతానికి పడిపోయిందని జేపీ నడ్డా స్పష్టం చేశారు.
ALso Read: JP Nadda: బీఆర్ఎస్‌తో ఢీ అంటే ఢీ.. ఎలాంటి కాంప్రమైజ్ లేదు: జేపీ నడ్డా
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద మోడీ 4 కోట్ల మందికి ఇళ్లు నిర్మించారని ఆయన తెలిపారు. కమల వికాసంతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని జేపీ నడ్డా పేర్కొన్నారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా రైతులకు ఏటా రూ.6 వేలు అందిస్తున్నామని.. కోవిడ్, ఉక్రెయిన్ యుద్ధం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆర్ధిక మాంద్యం ఏర్పడిందని ఆయన వెల్లడించారు. ఐటీ, ఆటోమొబైల్ సహా అన్ని రంగాల్లోనూ భారత్ దూసుకెళ్తోందన్నారు. మోడీ చేపట్టిన సంస్కరణలతో దేశం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందిందని జేపీ నడ్డా ప్రశంసించారు. మోడీని గ్లోబల్ లీడర్‌గా ప్రపంచమంతా కొనియాడుతోందని ఆయన గుర్తుచేశారు. ప్రపంచ ఆర్ధిక వ్యవస్థలో పదో స్థానంలో వున్న భారత్‌ను మోడీ ఐదో స్థానంలోకి తెచ్చారని నడ్డా కొనియాడారు.
కోవిడ్, ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఆర్ధిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయని ఆయన గుర్తుచేశారు. మోడీ ది బాస్ అని దేశాధినేతలే కొనియాడుతున్నారని.. కానీ కాంగ్రెస్ నేతలు కడుపు మండుతోందన్నారు. మోడీ ముందుచూపు చర్యలతో భారత ఆర్ధిక వ్యవస్థ మరింత పటిష్టంగా తయారైందని జేపీ నడ్డా అన్నారు. కోవిడ్, ఉక్రెయిన్ యుద్ధం తర్వాత కూడా ఆర్ధికంగా దూసుకెళ్తున్న ఏకైక దేశం భారతే అని జేపీ నడ్డా తెలిపారు.
తెలంగాణకు మోడీ భారీ ఎత్తున నిధులు ఇస్తున్నారని ఆయన తెలిపారు. తెలంగాణలో 2300 కిలోమీటర్ల మేర రోడ్డు వేశామని జేపీ నడ్డా వెల్లడించారు. సికింద్రాబాద్ - తిరుపతి వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను మోడీ ప్రారంభించారని ఆయన గుర్తుచేశారు. తెలంగాణలోని రైల్వే ప్రాజెక్ట్‌లకు మోడీ ప్రభుత్వం రూ.4,400 కోట్లు మంజూరు చేసిందన్నారు. తెలంగాణ ప్రజల కోసం మెగా టెక్స్‌టైల్స్ పార్కును మోడీ ఇచ్చారని జేపీ నడ్డా చెప్పారు. తెలంగాణలో రూ.11 వేల కోట్లతో మోడీ అభివృద్ధి పనులు చేపట్టారని ఆయన తెలిపారు. తెలంగాణలో ఇండస్ట్రియల్ కారిడార్లు, మెగా టెక్స్‌టైల్ పార్క్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ మోడీ చలవేనని జేపీ నడ్డా చెప్పారు.
