జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకుగాను బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా హైదరాబాద్‌ చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న నడ్డాకు ఎమ్మెల్యే రాజాసింగ్, పెద్దిరెడ్డి, కన్నా లక్ష్మినారాయణ స్వాగతం పలికారు.

అనంతరం కొత్తపేట చౌరస్తా నుంచి నాగోల్ వరకు నడ్డా రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... టీఆర్ఎస్‌ను ప్రజలు సాగనంపే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. గల్లీ ఎన్నికలకు ఢిల్లీ నేతలు వస్తున్నారని కేటీఆర్ విమర్శిస్తున్నారని నడ్డా ఎద్దేవా చేశారు.