తెలంగాణలో బీజేపీ నేతల అరెస్టులు అక్రమం, అప్రజాస్వామికమని ఆరోపించారు బీజేపీ అధికార ప్రతినిధి, రాజ్యసభ ఎంపీ రాజీవ్ చంద్రశేఖర్. దుబ్బాక ఉపఎన్నికలో ప్రచారం చేస్తున్న బీజేపీ కార్యకర్తలను అక్రమ అరెస్టులను చేయడం ద్వారా కేసీఆర్ సర్కార్ ఎంత బలహీనంగా ఉందొ అర్థమవుతుందని ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 

కార్యకర్తలను, నేతలను అక్రమంగా అరెస్టులు చేసి వారికి సంబంధించిన వారి ఇండ్లలో డబ్బులను పెట్టి, అక్రమంగా డబ్బు దొరికిందని కొత్త డ్రామాలు తెర తీయడం మరో వారసత్వ కుటుంబ రాజకీయానికి ప్రతీక అని ఆయన అన్నారు. 

పోలీసు వ్యవస్థని ఉపయోగించి నేతల అక్రమ అరెస్టులు కానీ, వేరే విధంగా ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడడం కానీ బీజేపీ నేతలను కానీ, వారి స్థైర్యాన్ని కానీ దెబ్బతీయలేదని అన్నారు. 

"