మోడీ టూర్‌లో పాల్గొనకపోవడం అభివృద్దిని అడ్డుకోవడమే:కేసీఆర్‌పై బీజేపీ ఎంపీ లక్ష్మణ్

 ప్రధాని నరేంద్ర మోడీ  కార్యక్రమంలో పాల్గొనాలని సీఎం కేసీఆర్ ను కోరారు బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్.ప్రతీ విషయాన్ని రాజకీయ కోణంలో చూడవద్దని కేసీఆర్ ను కోరారు లక్ష్మణ్.

BJP MP laxman Demands  KCR To Participate In Modi Programme

హైదరాబాద్:మనసు మార్చుకొని ప్రధాని నరేంద్ర మోడీ కార్యక్రమంలో పాల్గొనాలని తెలంగాణ సీఎం  కేసీఆర్ ను కోరారు బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్.శుక్రవారంనాడు మధ్యాహ్నం బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ హైద్రాబాద్ లో మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోడీ  కార్యక్రమానికి సీఎం కేసీఆర్ దూరంగా ఉండడం సరైందికాదన్నారు. రాజకీయ,అధికారిక  కార్యక్రమాలకు వ్యత్యాసం కేసీఆర్ కు తెలియదా అని డాక్టర్ లక్ష్మణ్ ప్రశ్నించారు.ప్రతీ విషయాన్ని కేసీఆర్ రాజకీయ కోణంలో చూస్తున్నారని లక్ష్మణ్ విమర్శించారు.రాజకీయాలు వేరు,.ప్రభుత్వాలు వేరే అనే విషయం కేసీఆర్ కు తెలియదా అని ఆయన ప్రశ్నించారు.కేసీఆర్ ఎందుకు పట్టింపులకు పోతున్నారో అర్థం కావడంలేదన్నారు.కమ్యూనిష్టులను రెచ్చగొడుతున్నది  ఎవరో చెప్పాలని ఆయన కోరారు.ప్రధానికి వ్యతిరేకంగా బ్యానర్లు కట్టి ఏం సంకేతం ఇవ్వదల్చుకున్నారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు.

aloread:తెలంగాణ అభివృద్దికి ప్రధానితో కలిసి రావాలి: కేసీఆర్‌కి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచన

ఇది తెలంగాణ అభివృద్దిని అడ్డుకోవడమేనని డాక్టర్ లక్ష్మణ్ చెప్పారు.ప్రధాని మోడీ టూర్ ను ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారని ఆయన చెప్పారు.అన్నిప్రభుత్వాలుప్రధానిని స్వాగతిస్తున్నాయన్నారు.స్టాలిన్ ,జగన్ లు ప్రధాని కార్యక్రమాల్లో పాల్గొంటున్న విషయాన్ని డాక్టర్ లక్ష్మణ్ గుర్తుచేశారు.తెలంగాణలో ప్రధాని రూ.9,500 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారన్నారు.రూ.6,300 కోట్లతో రామగుండం ఎరువుల  ఫ్యాక్టరీని కేంద్రం పునరుద్దరించిందని డాక్టర్ గుర్తు చేశారు.రాజకీయాలకుఅతీతంగా అభివృద్దికి మోడీ పెద్దపీట వేస్తున్నారని లక్ష్మణ్ చెప్పారు.ప్రధాని మోడీ కార్యక్రమాల్లో కేసీఆర్ పాల్గొనాలని ఆయన కోరారు. ప్రధాని కార్యక్రమంలో పాల్గొంటే రాష్ట్రానికి అవసరమైన నిధులను అడిగే అవకాశం ఉంటుందని ఆయన చెప్పారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios