Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ అభివృద్దికి ప్రధానితో కలిసి రావాలి: కేసీఆర్‌కి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచన

రామగుండం ఎరువుల  ఫ్యాక్టరీతో తెలంగాణలో యూరియా  కొరత  తీరుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి  చెప్పారు.

PM Modi to dedicate Ramagundam Fertilizers to nation on Nov 12: Union Minister Kishanreddy
Author
First Published Nov 10, 2022, 5:00 PM IST

హైదరాబాద్: తెలంగాణ అభివృద్ది కోసం జరిగే కార్యక్రమాలకు ప్రధానితో  కలిసి కేసీఆర్ హాజరు కావాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కోరారు.  ఇది పూర్తిగా అధికారిక కార్యక్రమమని  ఆయన చెప్పారు.న్యూఢిల్లీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గురువారం నాడు మీడియాతో మాట్లాడారు.రాష్ట్ర ప్రయోజనాల కోసం విభేదాలను , రాజకీయ వైరుధ్యాలను పక్కన పెట్టాలని ఆయన సీఎం కేసీఆర్ ను  కోరారు.చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రధాని పర్యటన సంధర్భంగా విజ్ఞతతో వ్యవహరించిన విషయాన్నిఆయన గుర్తు చేశారు. రామగుండం ప్రారంభోత్సవానికి రావడానికి కేసీఆర్  సాకులు చెబుతున్నారన్నారు.రాష్ట్ర అభివృద్ధి కోసం జాతీయ , రాష్ట్ర స్థాయి పార్టీలు సహకరించుకుంటూ పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు కిషన్ రెడ్డి.

యూరియా బ్లాక్ మార్కెటింగ్ ను అడ్డుకునేందుకు నీమ్ కోటెడ్ యూరియా ను ప్రవేశ పెట్టినట్టుగా కేంద్ర మంత్రి చెప్పారు.యూరియా తయారీలో దేశం స్వయం సమృద్ధి సాధించే ప్రయత్నం జరుగుతుందన్నారు.ప్రపంచ వ్యాపితంగా ఉన్న పరిస్థితుల నేపథ్యంలో యూరియా కొరత రాకుండా చూస్తున్నామన్నారు.రామగుండం పరిశ్రమ పునరుద్దరణ కోసం 6 వేల 300 కోట్లు కేంద్రం ఖర్చు చేసిందని ఆయన చెప్పారు. . 300 మెగావాట్ల క్యాప్టివ్ పవర్ ప్లాంట్, కార్మికుల కోసం టౌన్ షిప్ ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు.  50 కేజీల బస్తా యూరియా తయారీకి  రూ. 3 వేలు ఖర్చుఅయితే ప్రభుత్వం కేవలం రూ. 600 మాత్రమే ఇస్తున్నట్టుగా కిషన్ రెడ్డి చెప్పారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ పేరుతో పరిశ్రమ ప్రారంభం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకునే పనులు చేసి విఫలమయ్యాయన్నారు.ప్రధాని పర్యటన గురించి కేసీఆర్ కుటుంబం తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు.ప్రధాని పర్యటనను అడ్డుకునేందుకు పలువురిని రెచ్చగొట్టి ధర్నాలు చేయమని ప్రోత్సహిస్తున్నారని కేంద్ర  మంత్రి విమర్శించారు. విభజన హామీలు చేయలేదని సీపీఐ నాయుకులు ఆరోపిస్తున్నారన్నారు.సిధ్ధాంతాల ఆధారంగా రాజకీయ పార్టీలు పనిచేయాలని ఆయన సూచించారు. కుటుంబ సిద్ధాంతాలు , స్వప్రయోజనాల ఆధారంగా పార్టీలు పని చేయకూడదని ఆయన హితవు పలికారు. టీఆర్ఎస్ తోక పార్టీలు మారిన వామపక్షాలకు ప్రధాని పర్యటనను అడ్డుకునే హక్కు లేదన్నారు.

50 కేజీల బస్తా యూరియా తయారీకి  రూ. 3 వేలు ఖర్చుఅయితే ప్రభుత్వం కేవలం రూ. 600 మాత్రమే ఇస్తున్నట్టుగా కిషన్ రెడ్డి చెప్పారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ పేరుతో పరిశ్రమ ప్రారంభం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకునే పనులు చేసి విఫలమయ్యాయన్నారు. ప్రధాని పర్యటన గురించి కేసీఆర్ కుటుంబం తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు.ప్రధాని పర్యటనను అడ్డుకునేందుకు పలువురిని రెచ్చగొట్టి ధర్నాలు చేయమని ప్రోత్సహిస్తున్నారని కేంద్ర  మంత్రి విమర్శించారు. విభజన హామీలు చేయలేదని సీపీఐ నాయుకులు ఆరోపిస్తున్నారన్నారు.సిధ్ధాంతాల ఆధారంగా రాజకీయ పార్టీలు పనిచేయాలని ఆయన సూచించారు. కుటుంబ సిద్ధాంతాలు , స్వప్రయోజనాల ఆధారంగా పార్టీలు పని చేయకూడదని ఆయన హితవు పలికారు. టీఆర్ఎస్ తోక పార్టీలు మారిన వామపక్షాలకు ప్రధాని పర్యటనను అడ్డుకునే హక్కు లేదన్నారు.

రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రం సహకరిస్తూ పనిచేస్తుందన్నారు. పార్ బాయిల్డ్ రైస్ కొనుగోలులో  బియ్యం సేకరణ విషయంలో అనేక సార్లు రాష్ట్ర ప్రభుత్వం అడగకపోయినా డెడ్ లైన్ పొడగించిన విషయాన్ని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. తెలంగాణ కు ఉపయోగపడని మంత్రి అని తన పై దుష్ప్రచారం చేస్తున్నారని టీఆర్ఎస్ పై ఆయన మండిపడ్డారు. ఈ విమర్శలకు సరైన సమయంలో సమాధానం చెబుతానన్నారు.ప్రధాని పర్యటన సంధర్భంగా సంబంధం లేని అంశాలను ప్రస్తావిస్తూ రాజకీయాలు చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. సింగరేణి ప్రైవేటీకరణ అంటూ కేంద్రంపై ఇంగిత జ్ఞానం, విచక్షణ లేకుండా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. సింగరేణి ని ప్రైవేటీకరిస్తామని ఏనాడూ చెప్పలేదన్నారు.సింగరేణిలో రాష్ట్ర ప్రభుత్వ వాటా ఎక్కువగా ఉన్నప్పుడు కేంద్రం ఎలా ప్రైవేటీకరిస్తుందని ఆయన ప్రశ్నించారు.

రూ.40 లక్షలు విలువ దాటిన చేనేత ఉత్పత్తులపై మాత్రమే 5 శాతం జీఎస్టీ ఉంటుందన్నారు. . ఇందులో 2.5 శాతం రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలోకి వెళుతుందని కేంద్ర మంత్రి చెప్పారు.రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర వాటాగా ఉన్న 2.5 శాతాన్ని వదులుకోవాలని ఆయన కోరారు.. పెట్రోలియం ఉత్పత్తుల పై ధరలు ఎందుకు తగ్గించరని ఆయన ప్రశ్నించారు.రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి వస్తే చేనేత ఉత్పత్తులపై 2.5 శాతం జీఎస్టీ ని ఉపసంహరించుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.
రేపు,ఎల్లుండి తెలుగు రాష్ట్రాల్లో  ప్రధాని పర్యటిస్తారని ఆయన చెప్పారు. తెలంగాణ లో జాతీయ రహదారులకు భూమి పూజ , రామగుండం ఎరువుల కర్మాగారం ప్రారంభోత్సవం, రైల్వే ప్రాజెక్ట్‌ల ప్రారంభం చేస్తారని ఆయన చెప్పారు. తెలంగాణ లో రూ.9596 కోట్ల రూపాయల ప్రాజెక్టులను  ప్రధాని ప్రారంభిస్తారని వివరించారు. తెలంగాణ లో 2014 నుండి ఇప్పటి వరకు  1 లక్ష 4 వేల కోట్లతో జాతీయ రహదారులను అభివృద్ధి చేసినట్టుగా కిషన్ రెడ్డి చెప్పారు.

రీజినల్ రింగు రోడ్డు పనులు వేగంగా జరుగుతున్నాయని ఆయన చెప్పారు.రాష్ట్ర ప్రభుత్వం భూ సేకరణ ఎంత త్వరగా పూర్తి చేస్తే రింగ్ రోడ్డు పనులు అంత త్వరగా పూర్తి అవుతాయన్నారు.రీజినల్ రింగ్ రోడ్డు పూర్తయితే తెలంగాణ ముఖచిత్రం మారిపోతుందన్నారు. 

యూరియా బ్లాక్ మార్కెటింగ్ ను అడ్డుకునేందుకు నీమ్ కోటెడ్ యూరియా ను ప్రవేశ పెట్టినట్టుగా కేంద్ర మంత్రి చెప్పారు.యూరియా తయారీలో దేశం స్వయం సమృద్ధి సాధించే ప్రయత్నం జరుగుతుందన్నారు.ప్రపంచ వ్యాపితంగా ఉన్న పరిస్థితుల నేపథ్యంలో యూరియా కొరత రాకుండా చూస్తున్నామన్నారు.రామగుండం పరిశ్రమ పునరుద్దరణ కోసం 6 వేల 300 కోట్లు కేంద్రం ఖర్చు చేసిందని ఆయన చెప్పారు. . 300 మెగావాట్ల క్యాప్టివ్ పవర్ ప్లాంట్, కార్మికుల కోసం టౌన్ షిప్ ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు.  
 

 

 

Follow Us:
Download App:
  • android
  • ios