Asianet News TeluguAsianet News Telugu

మేడిగడ్డ ఖర్చును కేసీఆర్ నుండే వసూలు చేస్తాం: బండి సంజయ్

కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో  బీఆర్ఎస్ పై విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.  మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ప్రాంతాన్ని బీజేపీ బృందం నిన్న పరిశీలించింది. కేసీఆర్ సర్కార్ తీరుపై అవకాశం దొరికితే విపక్షాలు విరుచుకుపడుతున్నాయి.
 

BJP MP Bandi Sanjay Challenges to KCR on Kaleshwaram Project lns
Author
First Published Nov 5, 2023, 1:52 PM IST

హైదరాబాద్:తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మేడిగడ్డ  బ్యారేజీ కుంగిపోయిన ఘటనపై  నష్టాన్ని కేసీఆర్ కుటుంబం నుండి  వసూలు చేస్తామని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తెలిపారు. ఆదివారంనాడు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్  కరీంనగర్ లో మీడియాతో మాట్లాడారు.ఒకవేళ  ఈ నష్టం ఇవ్వకపోతే కేసీఆర్ ఆస్తులను జప్తు చేస్తామన్నారు.  కాళేశ్వరం ప్రాజెక్టు, చెక్ డ్యామ్ సహా ఇతర ప్రాజెక్టులకు గ్యారంటీ లేదన్నారు. ఎప్పుడు ఏ ప్రాజెక్టు కూలిపోతుందో అనే అనుమానం ఆయన వ్యక్తం చేశారు

మేడిగడ్డ బ్యారేజీ  ఎనిమిది పిల్లర్లు కుంగాయా లేదా చెప్పాలన్నారు.మేడిగడ్డ బ్యారేజీ వద్దకు  నిపుణులతో రావాలని, తాము కూడ నిపుణులతో  వస్తామని  బండి సంజయ్ కేటీఆర్ కు సవాల్ విసిరారు.

 కరీంనగర్ అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేయాలని పార్టీ ఆదేశించిందన్నారు. పార్టీ ఆదేశం మేరకు తాను  రేపు నామినేషన్ దాఖలు చేస్తున్నట్టుగా బండి సంజయ్ చెప్పారు.   బీసీలను కేసీఆర్ అవమానిస్తున్నారన్నారు. బీసీలకు కాంగ్రెస్, బీఆర్ఎస్ లు క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్ధిని సీఎంగా ఎందుకు  చేయరని కాంగ్రెస్, బీఆర్ఎస్ కు చెందిన బీసీ నేతలు ఆ పార్టీలను నిలదీయాలని ఆయన కోరారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదన్నారు. రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ బలిపశువు అవుతారని ఆయన చెప్పారు. తెలంగాణలో  రేవంత్ రెడ్డిని సీఎం  చేయకుండా ఉంటే తాము మీకు మద్దతిస్తామని కొందరు ముస్లిం పెద్దలు ఢిల్లీలో రాహుల్ గాంధీతో చెప్పారని తనకు సమాచారం ఉందన్నారు.ఈ విషయమై రాహుల్ గాంధీ కూడ సానుకూలంగా స్పందించారన్నారు.

also read:కాళేళ్వరంలో కేసీఆర్ సర్కార్ అవినీతి బట్టబయలు:బీజేపీ ఎంపీ లక్ష్మణ్

ఈ విషయం తెలిసిన కాంగ్రెస్ లోని ఇతర నేతలు సంతోషపడుతున్నారని బండి సంజయ్ చెప్పారు. కాంగ్రెస్ నేతలు సీఎం  పదవి కోసం గొడవ పడుతున్నారన్నారు. కానీ, ప్రజల గురించి పట్టించుకోవడం లేదని ఆయన  చెప్పారు.బీఆర్ఎస్ బీసీలకు 23 టిక్కెట్లను మాత్రమే కేటాయించిందన్నారు. కానీ తమ పార్టీ మాత్రం బీసీలకు ఎక్కువ సీట్లను కేటాయించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మరో వైపు బీసీ కమిషన్ ను కూడ ఏర్పాటు చేసిన బీజేపీదేనన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios