Asianet News TeluguAsianet News Telugu

బీఎల్‌ సంతోష్‌కు సిట్ నోటీసుపై హైకోర్టును ఆశ్రయించిన బీజేపీ.. 8 మందిని ప్రతివాదులుగా చేర్చిన పిటిషనర్..

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసులో  బీఎల్ సంతోష్, న్యాయవాది శ్రీనివాస్‌లకు సిట్ నోటీసులు జారీచేయడాన్ని సవాలు చేస్తూ బీజేపీ శుక్రవారం హైకోర్టును ఆశ్రయించింది. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్  దాఖలు చేశారు. 

BJP moves Telangana High court challenging Sit Notice to BJP BL Santhosh in TRS MLAs poaching case
Author
First Published Nov 19, 2022, 12:05 PM IST

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసులో  బీఎల్ సంతోష్, న్యాయవాది శ్రీనివాస్‌లకు సిట్ నోటీసులు జారీచేయడాన్ని సవాలు చేస్తూ బీజేపీ శుక్రవారం హైకోర్టును ఆశ్రయించింది. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్  దాఖలు చేశారు. కేసును పర్యవేక్షిస్తున్న సింగిల్ జడ్జి అనుమతి పొందిన తర్వాతే సిట్ నోటీసులు జారీ చేయాలని పేర్కొంటూ.. నోటీసులపై స్టే విధించాలని కోరారు. ఈ పిటిషన్‌లో ఎనిమిది మందిని ప్రతివాదులుగా చేర్చారు. తెలంగాణ ప్రభుత్వం, డీజీపీ,  సైబారాబాద్ పోలీస్ కమిషనర్, ఏసీపీ రాజేంద్రనగర్, సీహెచ్‌వో మొయినాబాద్, సెంట్రల్ హోమ్ ఎఫైర్స్, సీబీఐ, రోహిత్ రెడ్డిలను పిటిషనర్ ప్రతివాదులుగా చేర్చారు. 

కుట్రలో భాగంగానే ఆయనకు 41ఏ కింద నోటీసులు ఇచ్చారని ఆరోపించింది. బీఎల్ సంతోష్, లాయర్ శ్రీనివాస్కు నోటీసుల్లో ఒకే సెల్ నెంబర్ పెట్టారని చెప్పారు. దర్యాప్తు పేరుతో కేసుకు సంబంధం లేని వాళ్లను వేధించేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. సిట్‌‌ నోటీసులపై స్టే ఇవ్వాలని.. ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని కోరారు. 

Also Read: టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసులో గందరగోళం.. వారికి నోటీసుల్లో ఒకే ఫోన్ నంబర్.. అదే కారణమా

ఇక, టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రలోభాల కేసులో హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ నేతృత్వంలోని సిట్ దర్యాప్తు వేగవంతం చేసింది. ఈ క్రమంలోనే బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, కరీంనగర్‌కు చెందిన న్యాయవాది శ్రీనివాస్‌లతో పాటుకు సిట్ నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్‌లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లోని కార్యాలయంలో నవంబర్ 21న ఉదయం 10.30 గంటలకు సిట్ ఎదుట హాజరుకావాలని 41ఏ సీఆర్పీసీ నోటీసు జారీ చేసింది. విచారణకు హాజరుకాకపోతే అరెస్ట్ చేయాల్సి వస్తుందని స్పస్టం చేసింది. 

విచారణ అధికారి హోదాలో అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ పి గంగాధర్  ఈ నోటీసులు జారీ చేశారు. నోటీసులు అందిన తర్వాత మొబైల్స్‌లోని డేటాను ట్యాంపర్ చేయవద్దని నోటీసుల్లో పేర్కొన్నారు. అలాంటి ప్రయత్నం చేస్తే ప్రాసిక్యూషన్‌కు గురవుతామని హెచ్చరించారు. విచారణాధికారులకు సమాచారం ఇవ్వకుండా దేశం విడిచి వెళ్లరాదని కూడా నోటీసుల్లో పేర్కొన్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios