Asianet News TeluguAsianet News Telugu

హైద్రాబాద్‌ కలెక్టరేట్ వద్ద బీజేపీ ధర్నా, ఉద్రిక్తత: ఎమ్మెల్సీ రామచంద్రారావు అరెస్ట్

ఎల్ఆర్ఎస్ ను రద్దు చేయాలని , అర్హులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఇవ్వాలని డిమాండ్ చేస్తూ  మంగళవారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నిరసనలు చేపట్టింది.ఈ నిరసనలో భాగంగా హైద్రాబాద్ కలెక్టరేట్ ఎదుట బీజేపీ నేతలు మంగళవారం నాడు ధర్నా నిర్వహించారు. 

BJP MLC Ramachander Rao arrested in hyderabad
Author
Hyderabad, First Published Sep 22, 2020, 1:29 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

హైదరాబాద్: ఎల్ఆర్ఎస్ ను రద్దు చేయాలని , అర్హులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఇవ్వాలని డిమాండ్ చేస్తూ  మంగళవారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నిరసనలు చేపట్టింది.ఈ నిరసనలో భాగంగా హైద్రాబాద్ కలెక్టరేట్ ఎదుట బీజేపీ నేతలు మంగళవారం నాడు ధర్నా నిర్వహించారు. 

ఈ ధర్నా కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.  కలెక్టరేట్ గేటు దూకి లోపలికి వెళ్లేందుకు బీజేపీ శ్రేణులు ప్రయత్నించారు.  కలెక్టరేట్ ఆవరణలో ఉన్న చెట్టు ఎక్కి కొందరు బీజేపీ నేతలు నిరసనకు దిగారు. 

also read:గుడ్‌న్యూస్: ఎల్ఆర్ఎస్ కి ఫీజు తగ్గింపు, 2015 జీవో ప్రకారంగా వసూలు

కలెక్టరేట్ లోకి చొచ్చుకెళ్లే సమయంలో పోలీసులు, బీజేపీ కార్యకర్తలకు మధ్య తోపులాట చోటు చేసుకొంది. ఈ సమయంలో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. ఆందోళన చేస్తున్ బీజేపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎమ్మెల్సీ రామచందర్ రావు సహా పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

హైద్రాబాద్ తో పాటు కరీంనగర్, ఆదిలాబాద్, జనగామ కలెక్టరేట్ కార్యాలయాల వద్ద బీజేపీ నేతల ఆందోళనల సమయంలో ఉద్రిక్తత చోటు చేసుకొంది.తెలంగాణ ప్రభుత్వం స్థలాల క్రమబద్దీకరణ కోసం ఈ  ఏడాది ఆగష్టు 31వ తేదీన 131 జీవోను విడుదల చేసింది. ఎల్ఆర్ఎస్ ఫీజులు ఎక్కువగా ఉన్నాయని విపక్షాలు విమర్శలు గుప్పించాయి. ఎల్ఆర్ఎస్ ను రద్దు చేయాలని డిమాండ్ చేశాయి. దీంతో ఇటీవల ఎల్ఆర్ఎస్ ను సవరిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసిన విషయం తెలిసిందే. 

Follow Us:
Download App:
  • android
  • ios