హైదరాబాద్:  ఎమ్మెల్యే రాజాసింగ్ బీజేపీకి రాజీనామా చేశారు.  ఈ మేరకు తన రాజీనామా లేఖను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడికి పంపినట్టు చెప్పారు. గో రక్షణ కోసం  తాను ఉద్యమం చేయనున్నట్టు చెప్పారు. ఈ ఉద్యమంలో భాగంగానే  తాను బీజేపీకి రాజీనామాల చేసినట్టు ఆయన ప్రకటించారు.

ఆదివారం నాడు ఆయన హైద్రాబాద్‌లో మీడియాతో మాట్లాడారు.  గో రక్షణ కోసం  తాను ఏం చేయడానికైనా సిద్దమేనని  ప్రకటించారు. తాను చేసే ఉద్యమం వల్ల పార్టీకి ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశ్యంతోనే తాను బీజేపీకి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకొన్నట్టు చెప్పారు.

గో రక్షణ ఉద్యమం కోసం  పనిచేయనున్నట్టు  చెప్పారు. ఈ  కారణంగానే తాను  బీజేపీకి రాజీనామా చేయాలని  నిర్ణయం తీసుకోన్నానని ఆయన చెప్పారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను నాలుగు రోజుల క్రితమే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడికి లేఖను పంపినట్టు చెప్పారు.

గోవధను ప్రభుత్వం అరికట్టాలని ఆయన డిమాండ్ చేశారు.  గోరక్షణ కోసం ఉద్యమించనున్నట్టు ఆయన చెప్పారు. తన ఉద్యమానికి , గో రక్షణ ఉద్యమానికి లింకు పెట్టకూడదని  ఆయన కోరారు.