Asianet News TeluguAsianet News Telugu

నలభైఐదు ఆవులను రక్షించిన రాజాసింగ్... అక్రమంగా తరలిస్తున్న లారీని వెంబడించి..

ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. అక్రమంగా లారీలో తరలిస్తున్న ఆవులను ఛేజ్ చేసి మరీ పట్టుకుని రక్షించారు.  బీజేపీ తెలంగాణ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరో 45 ఆవులను రక్షించారు. 

BJP MLA Raja Singh Chased and Caught Illegal 45 Cows Transportation in Choutuppal PS limits - bsb
Author
Hyderabad, First Published Dec 22, 2020, 11:55 AM IST

ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. అక్రమంగా లారీలో తరలిస్తున్న ఆవులను ఛేజ్ చేసి మరీ పట్టుకుని రక్షించారు.  బీజేపీ తెలంగాణ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరో 45 ఆవులను రక్షించారు. 

అక్రమంగా లారీలు, ట్రక్కుల్లో తరలిస్తోన్న ఆవులను ఇప్పటికే ఆయన చాలాసార్లు అడ్డుకున్న విషయం తెలిసిందే. మహారాష్ట్ర నుంచి అక్రమంగా బహుదూర్‌పుర తరలిస్తోన్న ఆవుల లారీని గత రాత్రి చౌటుప్పల్ చెక్‌పోస్ట్ వద్ద వెంబడించి మరీ పట్టుకున్నారు. 
అనంతరం  ఆ వాహనాన్ని స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో అప్పగించారు. ఈ నేపథ్యంలో ఆయన తెలంగాణ పోలీసులపై మండిపడ్డారు. పోలీసులు డబ్బులకు అలవాటుపడి ఆవుల అక్రమ రవాణాకు సహకరిస్తున్నారని ఆయన చెప్పారు. పోలీసులు ప్రవరిస్తోన్న తీరుపై తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి స్పందించాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు. 

ఆవులను వధించటం నేరమని ఆయన వ్యాఖ్యానించారు. తాము గోవధపై బహుదూర్ పుర మునిసిపల్ కమిషనర్‌కు ఇప్పటికే ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవటం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios