Asianet News TeluguAsianet News Telugu

హుజురాబాద్‌లో ఓ సైకో .. నాపైనే సుపారీ ఇస్తారా, చెప్పుల దండా వేసి తిప్పుతా : ఈటల రాజేందర్ వార్నింగ్

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డిపై మండిపడ్డారు బీజేపీ ఎమ్మెల్యే , మాజీ మంత్రి ఈటల రాజేందర్. తమ సహనం నశిస్తే, హుజురాబాద్ చౌరస్తాలో చెప్పుల దండ వేసి తిప్పుతానని ఈటల హెచ్చరించారు. తమ సహనం నశిస్తే, హుజురాబాద్ చౌరస్తాలో చెప్పుల దండ వేసి తిప్పుతానని ఈటల హెచ్చరించారు. 
 

bjp mla etela rajender sensational comments on brs mlc kaushik reddy ksp
Author
First Published Jun 28, 2023, 2:35 PM IST

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డిపై మండిపడ్డారు బీజేపీ ఎమ్మెల్యే , మాజీ మంత్రి ఈటల రాజేందర్ . హుజురాబాద్‌లో బీఆర్ఎస్ ఒక సైకోను ఎమ్మెల్సీగా చేసిందని.. కులాలు, మతాలు అన్న తేడా లేకుండా బెదిరింపులకు, కిడ్నాప్‌లకు పాల్పడుతున్నారని రాజేందర్ ఆరోపించారు. దీనిపై సీపీకి కూడా ఫిర్యాదు చేసినట్లు ఈటల తెలిపారు. చివరికి తనపైనా సుపారీ ఇచ్చే వరకు వచ్చిందని.. తమ సహనం నశిస్తే, హుజురాబాద్ చౌరస్తాలో చెప్పుల దండ వేసి తిప్పుతానని ఈటల హెచ్చరించారు. 

కేసీఆర్ ప్రోద్బలంతోనే ఈ సైకో వేధింపులకు దిగుతున్నాడని.. అతని వల్లే మీ పార్టీ కార్యకర్తలపై దాడులు, దౌర్జన్యాలు జరుగుతామన్నారు. త్వరలోనే కేసీఆర్‌కు కర్రు కర్ర కాల్చి వాత పెడతారని ఈటల జోస్యం చెప్పారు. సాంబశివుడిని హత్య చేసినప్పుడు స్టేట్‌మెంట్ ఇచ్చానని, తన డ్రైవర్‌ను కిడ్నాప్ చేశారని అప్పుడే తాను భయపడలేదని రాజేందర్ గుర్తుచేశారు. అందరికీ రక్షణ కల్పించాల్సిన బాధ్యత సీఎంది, ప్రభుత్వానిదని ఈటల తెలిపారు. 

ALso Read: ఈటల రాజేందర్ భద్రతపై కేటీఆర్ ఆరా: డీజీపీకి మంత్రి ఫోన్

మరోవైపు.. ఈటల రాజేందర్  భద్రత విషయమై  తెలంగాణ మంత్రి  కేటీఆర్  ఆరా తీశారు.  ఈ విషయమై  తెలంగాణ డీజీపీ అంజనీకుమార్ తో  మంత్రి కేటీఆర్  ఫోన్ లో మాట్లాడారు. ఈటల రాజేందర్  భద్రత విషయమై  వెరిఫై  చేయాలని  డీజీపీని  మంత్రి కేటీఆర్ కోరినట్టుగా  సమాచారం. భద్రత విషయంలో  ఎలాంటి లోటుపాట్లు  లేకుండా చూడాలని  మంత్రి కోరారని సమాచారం. అటు  ఈటల రాజేందర్‌కు కేంద్ర ప్రభుత్వం భద్రత కల్పించనుంది. ఆయనను హతమార్చేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారన్న వార్తల నేపథ్యంలో ఈటలకు ‘‘వై కేటగిరీ’’ భద్రత కల్పించాలని కేంద్ర హోంశాఖ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.

అంతకుముందు ఈటల రాజేందర్  సతీమణి ఈటల జమున సంచలన ఆరోపణలు చేశారు. ఈటల రాజేందర్‌ను చంపేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఈటల రాజేందర్‌ను రూ. 20 ఇచ్చి కోట్లు చంపిస్తానని కౌశిక్ రెడ్డి అంటున్నారని ఆరోపణలు చేశారు. ఈటల రాజేందర్‌ను చంపిస్తామంటే తాము భయపడమని తెలిపారు. తెలంగాణ ఉద్యమం చేసేటప్పుడు.. నయీం వంటి వ్యక్తులు బెదిరిస్తేనే భయపడలేదని చెప్పారు. కౌశిక్ రెడ్డి మాటల  వెనక కేసీఆర్ ఉన్నారని ఈటల జమున ఆరోపించారు. ఇలాంటి ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజలకు అవసరమా? అని  ప్రశ్నించారు. ఆయనకు వ్యతిరేకంగా పనిచేసే వాళ్లను రూ. 20 కోట్లు ఇచ్చి చంపిస్తారా? అని ప్రశ్నించారు. ఇలాంటి కేసీఆర్‌కు రానున్న ఎన్నికల్లో ప్రజలు ఓటుతో బుద్ది చెబుతారని అన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios