Asianet News TeluguAsianet News Telugu

ఈటల రాజేందర్ భద్రతపై కేటీఆర్ ఆరా: డీజీపీకి మంత్రి ఫోన్

మాజీ మంత్రి  ఈటల రాజేందర్ భద్రత విషయంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆరా తీశారు. ఈ విషయమై  తెలంగాణ డీజీపీ  అంజనీకుమార్ తో  కేటీఆర్ మాట్లాడారు.

Telangana Minister  KTR  Phoned  To  Telangana DGP  Anjani kumar  over  Etela Rajender Security lns
Author
First Published Jun 28, 2023, 10:14 AM IST | Last Updated Jun 28, 2023, 10:14 AM IST

హైదరాబాద్: మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత ఈటల రాజేందర్  భద్రత విషయమై  తెలంగాణ మంత్రి  కేటీఆర్  ఆరా తీశారు.  ఈ విషయమై  తెలంగాణ డీజీపీ అంజనీకుమార్ తో  మంత్రి కేటీఆర్  ఫోన్ లో మాట్లాడారు. ఈటల రాజేందర్ భద్రత విషయమై అడిగి తెలుసుకున్నారు.ఈటల రాజేందర్  భద్రత విషయమై  వెరిఫై  చేయాలని  డీజీపీని  మంత్రి కేటీఆర్ కోరినట్టుగా  సమాచారం.

భద్రత విషయంలో  ఎలాంటి లోటుపాట్లు  లేకుండా  చూడాలని  మంత్రి కోరారని సమాచారం.  సీనియర్ ఐపీఎస్ అధికారితో ఈటల రాజేందర్ కు కేటాయించిన భద్రత విషయమై  పరిశీలన చేయాలని మంత్రి కేటీఆర్  డీజీపీకి సూచించారని సమాచారం. ఈటల రాజేందర్ భద్రత విషయమై  పోలీసు ఉన్నతాధికారులు  సమీక్ష  నిర్వహించే అవకాశం ఉంది. ఈటల రాజేందర్  ఇంటికి  సీనియర్ పోలీస్ ఉన్నతాధికారి  వెళ్లి భద్రతను  పరిశీలించే అవకాశం ఉందని సమాచారం. 

మాజీ మంత్రి ఈటల రాజేందర్ ను  అంతమొందించేందుకు  బీఆర్ఎస్ ఎమ్మెల్సీ  కౌశిక్ రెడ్డి కుట్ర పన్నారని  ఈటల రాజేందర్ సతీమణి జమున ఆరోపించారు. తమ మీద అక్కసుతోనే  కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవిని ఇచ్చారని  జమున ఆరోపణలు  చేశారు.

ఈ ఆరోపణల నేపథ్యంలో  ఈటల రాజేందర్ కు  వై కేటగిరి భద్రతను  కల్పించే దిశగా  కేంద్రం యోచిస్తున్నట్టుగా  ప్రచారం సాగుతుంది.  ఈ తరుణంలో  తెలంగాణ డీజీపీ అంజనీకుమార్ తో తెలంగాణ  మంత్రి కేటీఆర్  ఆరా తీయడం ప్రాధాన్యత  సంతరించుకుంది. 

also read:ఈటల రాజేందర్‌ను హత్య చేసేందుకు కుట్ర.. : జమున సంచలన ఆరోపణ

ఈటల రాజేందర్ ప్రస్తుతం  హుజూరాబాద్ అసెంబ్లీ స్థానం నుండి ప్రాతినిథ్యం వహిస్తున్నారు.  బీఆర్ఎస్ ను వీడి  బీజేపీలో  చేరిన తర్వాత  హుజూరాబాద్ అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేసి  ఆయన  విజయం సాధించారు.గతంలో  ఇదే  అసెంబ్లీ స్థానం నుండి   కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా  కౌశిక్ రెడ్డి  పోటీ చేసి ఈటల రాజేందర్ పై  ఓటమి పాలయ్యారు. కౌశిక్ రెడ్డి  కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్ లో చేరారు. కౌశిక్ రెడ్డి  బీఆర్ఎస్ లో చేరిన తర్వాత  ఆ పార్టీ నాయకత్వం  కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టింది.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios