Asianet News TeluguAsianet News Telugu

గజ్వేల్‌లో సీఎంపై పోటీ.. నాకు మద్ధతిస్తే తొక్కిపడేస్తాడంట : హరీశ్‌రావుపై ఈటల రాజేందర్ ఆగ్రహం

బీఆర్ఎస్ నేత, మంత్రి హరీశ్‌రావుపై మండిపడ్డారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ .  నాకు మద్ధతు ఇస్తే తొక్కిపడేస్తానని హరీశ్‌రావు అన్నట్లుగా తెలసిందని మండిపడ్డారు. తొక్కిపడేసే శక్తి నీకు లేదని ఈటల రాజేందర్ కౌంటరిచ్చారు. 

bjp mla etela rajender fires on minister harish rao ksp
Author
First Published Oct 17, 2023, 7:48 PM IST

బీఆర్ఎస్ నేత, మంత్రి హరీశ్‌రావుపై మండిపడ్డారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. మంగళవారం రాజేందర్ సమక్షంలో వివిధ పార్టీలకు చెందిన నేతలు బీజేపీలో చేరారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ.. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బీజేపీలో చేరుతున్నారని తెలిపారు. బీజేపీకి ఓటు వేసి కేసీఆర్‌ను ఓడించాలని ప్రజలు భావిస్తున్నారని ఈటల రాజేందర్ తెలిపారు. డబ్బుతో గెలవాలని కేసీఆర్ చూస్తున్నారని.. ఎమ్మెల్యే అభ్యర్ధులకు ఇప్పటికే పోలీస్ పహారాలో డబ్బులు పంపించారని ఆయన ఆరోపించారు. బీజేపీ నాయకులకు వెలకట్టి కొనాలని చూస్తున్నారని రాజేందర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

ALso Read: అది ఆషామాషీగా చెప్పలేదు.. కేసీఆర్ ను ఓడించి తీరతా.. ఈటల రాజేందర్

హుజురాబాద్ ఎన్నికల సమయంలో కేసీఆర్ ఎన్నో ఇబ్బందులు పెట్టారని ఈటల అన్నారు. గజ్వేల్‌లో పోటీ చేస్తున్నట్లు చెప్పిన ఆయన.. తాను అక్కడికి వెళ్లకముందే వందలమంది మీటింగ్ పెట్టుకుని తనకు మద్ధతు ఇస్తున్నారని తెలిపారు. గజ్వేల్ ప్రజల గుండెల్లో ఎవరున్నారో నవంబర్ 30న తేలిపోతుందని ఆయన చెప్పారు. కేసీఆర్ దుర్మార్గపు పాలనను అంతం చేయడానికి ప్రజలు సిద్ధంగా వున్నారని రాజేందర్ వ్యాఖ్యానించారు. గజ్వేల్‌లో పేదల భూములు లాక్కొని రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఇస్తున్నారని .. నాకు మద్ధతు ఇస్తే తొక్కిపడేస్తానని హరీశ్‌రావు అన్నట్లుగా తెలసిందని మండిపడ్డారు. తొక్కిపడేసే శక్తి నీకు లేదని ఈటల రాజేందర్ కౌంటరిచ్చారు. 

Follow Us:
Download App:
  • android
  • ios