Asianet News TeluguAsianet News Telugu

ఉద్యోగాలు రావాలంటే.. కేసీఆర్ ను గద్దె దించాల్సిందే: ఈటెల

తెలంగాణ యువకులకు సీఎం కేసీఆర్ అన్యాయం చేశారనీ,  భర్తరఫ్ చేయాల్సింది టీఎస్పీఎస్సీని కాదనీ, కేసీఆర్ ని అనీ, సీఎం కేసీఆర్ ని గద్దెదించితేనే మనకు ఉద్యోగాలు వస్తాయని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

BJP MLA Etela Rajender Fires On CM KCR Adilabad Dist KRJ
Author
First Published Oct 10, 2023, 11:11 PM IST

ఆదిలాబాద్ జిల్లాలో తెలంగాణ బీజేపీ నిర్వహించిన తెలంగాణ జనగర్జన సభలో అమిత్ షా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సభలో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ పాల్గొని మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వంపై విరుచకపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది ప్రాణాల త్యాగాలు చేశారనీ, తాము చచ్చిపోయిన పర్లేదనీ, తమ తోటివారికైనా ఉద్యోగాలు వస్తాయని ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేశారని గుర్తు చేశారు. ఎంతో మంది అమర వీరుల త్యాగాల పునాదులతో తెలంగాణ రాష్రంగా ఆవిర్భవించిందనీ, కానీ.. ఆ ఉద్యమ ఫలితాలను అనుభవిస్తుంది కేసీఆర్, ఆయన కుటుంబం, ఆయన బంధు వర్గమేనని విమర్శించారు. 

ఆదిలాబాద్ లోని స్వర్ణవాగు, గడ్డనవాగు పొంగి పక్కనున్న పొలాలు అన్ని మునిగిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారనీ, కానీ వారికి ఒక్క రూపాయి కూడా కేసీఆర్ ఇవ్వలేదని అన్నారు. కానీ, వేరే రాష్ట్రాల్లో మన డబ్బులు పంచిపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 30 లక్షల మంది తెలంగాణ యువకులకు సీఎం కేసీఆర్ అన్యాయం చేశారనీ,  భర్తరఫ్ చేయాల్సింది టీఎస్పీఎస్సీని కాదు కేసీఆర్ ని అనీ, సీఎం కేసీఆర్ ని గద్దెదించితేనే మనకు ఉద్యోగాలు వస్తాయనీ,  అప్పటివరకు మనం నిద్రపోవద్దని అన్నారు.  

ఆనాడు తెలంగాణ వస్తే రాష్ట్ర ఆడబిడ్డలంతా లక్షాధికారులు అవుతారని కేసీఆర్ చెప్పారనీ,  కానీ, వారికి వడ్డీ లేని రుణాల పైసలు కూడా ఇవ్వడం లేదనీ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం వడ్డీ లేని రుణాల కింద వారి వాటా ఇస్తున్నా.. నాలుగు సంవత్సరాలు అయినా కేసీఆర్ డబ్బులు ఇవ్వడం లేదని విమర్శించారు.  సీఎం కేసీఆర్ వల్ల బ్యాంకులలో మహిళా సంఘాల గ్రూపులు డిఫాల్టర్ గా మిగిలిపోతున్నాయనీ,  మహిళలు రుణాలు తీసుకోవడానికి వీలు కాకుండా పోతున్నారని మండిపడ్డారు. బీజేపీ అధికారంలోకి వస్తే.. ప్రతి మూడు నెలలకు ఒకసారి వడ్డీ లేని రుణాలను అందిస్తామనీ,  వివోఏలకు జీతాలను కూడా పెంచుతామని హామీ ఇచ్చారు. 

Follow Us:
Download App:
  • android
  • ios