టెన్త్ పేపర్ లీక్ కేసు.. పోలీసులు ఎదుట విచారణకు హాజరైన ఈటల రాజేందర్..
మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వరంగల్ పోలీసులు హాజరయ్యారు. టెన్త్ పేపర్ లీక్ కేసుకు సంబంధించి పోలీసులు ఈటల రాజేందర్‌ను విచారిస్తున్నారు.
వరంగల్: మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వరంగల్ పోలీసులు హాజరయ్యారు. టెన్త్ పేపర్ లీక్ కేసుకు సంబంధించి పోలీసులు ఈటల రాజేందర్‌ను విచారిస్తున్నారు. వరంగల్ సెంట్రల్ డీసీపీ, ఏసీపీలు.. ఈటల రాజేందర్‌ను ప్రశ్నిస్తున్నట్టుగా సమాచారం. ఈ కేసులో నిందితుడిగా ఉన్న మాజీ జర్నలిస్టు ప్రశాంత్.. పదో తరగతి హిందీ ప్రశ్నపత్రాన్ని ఈటల రాజేందర్ వాట్సాప్ ద్వారా పంపినట్టుగా పోలీసులు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి నాలుగు రోజుల క్రితం ఈటల రాజేందర్‌కు నోటీసులు జారీ చేయడంతో.. ఆయన నేడు పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు.
ఇక, ఇదే కేసుకు సంబంధించి ఈటెల రాజేందర్ ఇద్దర పిఎలు రాజు, నరేందర్‌లను పోలీసులు ఇప్పటికే విచారించారు. ఇద్దరి స్టేట్‌మెంట్ రికార్డ్ చేశారు. అలాగే పేపర్ లీక్ కేసులో ప్రశాంత్ హిందీ పేపర్‌ను పంపిన నాలుగు వాట్సాప్ గ్రూపుల అడ్మిన్లకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. అంతేకాకుండాఇద్దరు జర్నలిస్టులను కూడా పోలీసులు విచారించారు. వారి స్టేట్‌మెంట్ రికార్డ్ చేయడంతో పాటుగా.. మొబైల్ ఫోన్లను కూడా పరిశీలించారు.