Asianet News TeluguAsianet News Telugu

వలసలపై ఫోకస్, రెండో జాబితాపై కసరత్తు:కిషన్ రెడ్డికి హైకమాండ్ పిలుపు

తెలంగాణలోని  17 పార్లమెంట్ స్థానాల్లో  మెజారిటీ స్థానాల్లో విజయం దక్కించుకోవడంపై  బీజేపీ వ్యూహరచన చేస్తుంది.

 BJP likely to Release  Second list from Telangana For Loksabha Elections lns
Author
First Published Mar 9, 2024, 2:03 PM IST


హైదరాబాద్:  తెలంగాణపై  భారతీయ జనతా పార్టీ  ఫోకస్ పెట్టింది. పార్టీ జాతీయ నాయకత్వం పిలుపు మేరకు  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి  ఇవాళ మధ్యాహ్నం  న్యూఢిల్లీకి వెళ్లనున్నారు. బీజేపీ ఇప్పటికే తొలి జాబితాను విడుదల చేశాయి.ఈ జాబితాలో నలుగురు అభ్యర్థుల పేర్లను బీజేపీ ప్రకటించింది.

also read:ఎన్‌డీఏలోకి తెలుగుదేశం: ఆహ్వానించిన బీజేపీ, త్వరలో అధికారిక ప్రకటన?

రెండు రోజుల తర్వాత రెండో జాబితాను విడుదల చేసే అవకాశం ఉంది. సోమవారం నాడు బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ ఉంది.  భారత రాష్ట్ర సమితికి చెందిన మాజీ ఎంపీలు  బీజేపీలో చేరే అవకాశం ఉందనే ప్రచారం సాగుతుంది.

also read:ప్రపంచంలో పొడవైన సేలా టన్నెల్: ప్రారంభించిన మోడీ

ఆదిలాబాద్ మాజీ ఎంపీ నగేష్  బీజేపీలో చేరే అవకాశం ఉందనే ప్రచారం సాగుతుంది.  నగేష్ తో బీజేపీ నేతలు చర్చలు జరిపినట్టుగా  ప్రచారం సాగుతుంది.ఈ నెల  12వ తేదీ లోపుగా  నగేష్ బీజేపీ తీర్థం పుచ్చుకొనే అవకాశం ఉందని సమాచారం.

also read:అమిత్ షాతో చంద్రబాబు, పవన్ భేటీ: పొత్తు చర్చలు

బీజేపీ విడుదల చేసిన తొలి జాబితాలో  ఆదిలాబాద్ సిట్టింగ్ ఎంపీ బాపురావుకు చోటు దక్కలేదు. బీఆర్ఎస్ కు చెందిన మాజీ ఎంపీ సీతారాం నాయక్   బీఆర్ఎస్ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్నారు. శుక్రవారంనాడు సీతారాం నాయక్ తో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి  సమావేశమయ్యారు.  త్వరలోనే తన అనుచరులతో సమావేశమై భవిష్యత్తు కార్యాచరణను నిర్ణయించుకోనున్నట్టుగా  సీతారాం నాయక్ ప్రకటించారు. సీతారాం నాయక్ ను మహబూబాబాద్ పార్లమెంట్ స్థానం నుండి బరిలోకి దింపాలని  ఆ పార్టీ భావిస్తుందని ప్రచారం సాగుతుంది.

also read:చైనా సరిహద్దుల్లో రెండు పినాకా రిజిమెంట్లు: మోహరించనున్న భారత్

ఈ నెల  12న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా  హైద్రాబాద్ కు రానున్నారు. బూత్ లెవల్ స్థాయి పార్టీ కార్యకర్తలతో  అమిత్ షా భేటీ కానున్నారు.  తెలంగాణ రాష్ట్రంలోని  17 ఎంపీ స్థానాల్లో  రెండంకెల స్థానాల్లో విజయం సాధించాలని  బీజేపీ  ప్లాన్ చేస్తుంది.ఈ క్రమంలోనే పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు గుర్రాలను బరిలోకి దింపాలని ఆ పార్టీ భావిస్తుంది. ఇతర పార్టీల నుండి  అసంతృప్తులను  బీజేపీ ఆహ్వానిస్తుంది.

తెలంగాణ రాష్ట్రంలోని  17 పార్లమెంట్ స్థానాల్లో  రెండంకెల స్థానాల్లో విజయం సాధించాలని  బీజేపీ ప్లాన్ చేస్తుంది.ఈ మేరకు ఇతర పార్టీల్లోని అసంతృప్తులకు ఆ పార్టీ గాలం వేస్తుంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios