వచ్చే వారంలో బీజేపీ అభ్యర్థుల జాబితా: 30 మందికి చోటు దక్కే అవకాశం

వచ్చే వారంలో  బీజేపీ అభ్యర్థులను ప్రకటించనుంది. ఈ జాబితాలో 30 మంది పేర్లు ఉండే అవకాశం ఉంది.

BJP Likely to Announce Candidates List  next Week  lns

హైదరాబాద్: వచ్చే వారంలో బీజేపీ అభ్యర్ధుల జాబితాను విడుదల చేయనుంది. ఈ జాబితాలో  30 మంది అభ్యర్థుల పేర్లు ఉండే అవకాశం ఉంది. కేంద్ర మంత్రి  అమిత్ షాతో  కేంద్ర మంత్రి  కిషన్ రెడ్డి సోమవారంనాడు భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడే  అవకాశం ఉందనే  ప్రచారం సాగుతున్న నేపథ్యంలో  అమిత్ షాతో  కిషన్ రెడ్డి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ఏడాది సెప్టెంబర్ 4వ తేదీ నుండి 10వ తేదీ వరకు  ఆశావాహుల నుండి బీజేపీ నాయకత్వం ధరఖాస్తులను స్వీకరించింది.

ఈ నెల  రెండో వారంలో  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడే  అవకాశం ఉందనే ప్రచారం సాగుతుంది. దీంతో  బీజేపీ కూడ అభ్యర్థుల జాబితాను ప్రకటించాలని భావిస్తుంది. అభ్యర్థుల ఎంపిక కోసం ఆ పార్టీ నాయకత్వం  ఇప్పటికే కసరత్తును ప్రారంభించింది. బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ  అభ్యర్థుల జాబితాలను విడుదల చేయనుంది. వచ్చే వారంలో  30 మందితో అభ్యర్థుల జాబితాను బీజేపీ  ప్రకటించే అవకాశం ఉంది.

బీజేపీ ప్రకటించే తొలి జాబితాలో  సీనియర్ల పేర్లు ఉండే అవకాశం ఉంది. తెలంగాణలో ఈ దఫా అధికారాన్ని దక్కించుకోవాలని బీజేపీ పట్టుదలతో ఉంది.  ఈ విషయమై  ఆ పార్టీ నేత  సునీల్ భన్సల్ క్షేత్రస్థాయిలో  పార్టీని సంస్థాగతంగా  బలోపేతం చేసే విషయమై వ్యూహా రచన చేస్తున్నారు. గత కొంత కాలంగా  భన్సల్ నేతృత్వంలోని టీమ్ రాష్ట్రంలో పనిచేస్తుంది.

also read:వచ్చే వారంలో బీజేపీ అభ్యర్థుల జాబితా: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

ఎలాంటి వివాదం లేని  ఒక్క అభ్యర్థి ఉన్న అసెంబ్లీ స్థానాల జాబితాను బీజేపీ ప్రకటించనుంది.  పార్టీ కీలక నేతలను ఈ దఫా అసెంబ్లీ బరిలోకి దింపనుంది. తెలంగాణపై బీజేపీ కేంద్ర నాయకత్వం కూడ ఫోకస్ పెట్టింది. దుబ్బాక, హుజూరాబాద్, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ మెరుగైన ఫలితాలు సాధించింది. దీంతో బీజేపీపై కేంద్ర నాయకత్వం తెలంగాణపై  ఫోకస్ ను పెంచింది. అదే సమయంలో ఇతర పార్టీలకు చెందిన అసంతృప్త నేతలను పార్టీలో చేరేలా ప్రోత్సహించింది. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి  బీజేపీలో చేరారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీలో నేతల చేరికలపై  కిరణ్ కుమార్ రెడ్డి కీలకంగా వ్యవహరిస్తున్నారు. 

 


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios