Asianet News TeluguAsianet News Telugu

బీజేపీని భయపెడతున్న తెలంగాణ రాముడు

ఎన్నికల  వేళ రామ నామ జపంతో బరిలోకి దిగే కమలనాథులు.. తెలంగాణలో మాత్రం ఈ రాముండంటే ఎందుకు భయపడుతున్నారు..?

 

bjp leaders fire on tjac

తెలంగాణ రాజకీయ జేఏసీకి బీజేపీ నేతలు భయపడుతున్నారా... ?

అదో మరో ఆప్ పార్టీల మారి తమకు కొరకరాని కొయ్యలా మారుతోందని భావిస్తున్నారా..? కమలనాథుల వ్యవహార శైలి చూస్తుంటే అలానే అనిపిస్తోంది.

 

ఇటీవల నిరుద్యోగ నిరసన ర్యాలీపై టీజేఏసీ పిలుపునిస్తే దానిపై బీజేపీ నుంచి కనీస స్పందన కూడా రాలేదు. లక్షల మంది నిరుద్యోగల ఆవేదనపై ఓ ప్రజాసంఘం చొరవ తీసుకుంటే మద్దతివ్వకుండా మౌనంగా ఉండిపోయింది.

 

ప్రతిపక్ష పార్టీలు ఎక్కడైనా అధికార పక్షాన్ని విమర్శిస్తుంటాయి. అలా చేస్తేనే రాజకీయంగా తమకు మైలేజీ పెరుగుతోందని భావిస్తుంటాయి. అందుకే అధికార పక్షం తప్పులను ఎత్తిచూపడానికి సదా సిద్ధంగా ఉంటాయి. అయితే తెలంగాణలో మాత్రం బీజేపీ నేతలు దీనికి పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నారు.

 

bjp leaders fire on tjacఆంధ్రాలో అధికార టీడీపీతో మిత్ర మిక్షంగా ఉన్న బీజేపీ అక్కడి ప్రభుత్వ పాలనను విమర్శించడానికి ఏ మాత్రం వెనకడుగు వేయడం లేదు. ఏపీ ప్రత్యేక హోదాపై టీడీపీ డిమాండ్ చేస్తుంటే దానికి అక్కడి బీజేపీ నేతలు ధీటుగానే సమాధానం ఇచ్చారు.

అదే తెలంగాణలో కమలనాథులు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఇక్కడ అధికార టీఆర్ఎస్ తో బీజేపీ మిత్రపక్షం ఏమీ కాదు. ఏపీతో పోల్చితే తెలంగాణలో నే వారికి బలం ఎక్కువ. అదృష్టం బాగుంటే వచ్చే ఎన్నికల్లో కింగ్ మేకర్ గా మారే అవకాశం కూడా బీజేపీకి ఉంది.

 

ఇలాంటి సమయంలో అధికార టీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగడుతూ మాట్లాడిల్సిన కమలనాథులు ఆ పనిచేయకుండా తెలంగాణ రాజకీయ జేఏసీ మీద విమర్శలు గుప్పిస్తున్నారు. నిజంగా ఇది చాలా మందికి ఆశ్చర్యం కలిగిస్తోంది.

 

ఇటీవల టీ జేఏసీ తలపెట్టిన నిరుద్యోగర్యాలికి కూడా బీజేపీ నేతలు మద్దతివ్వలేదు. కనీసం దానిపై స్పందిచనే లేదు.

 

ఆ తర్వాత కోదండరాంను అక్రమంగా  అరెస్టు చేడయం, ర్యాలీపై ఉక్కు పాదం మోపడంపై కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, టీడీపీ, ప్రజా సంఘాలు కూడా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించాయి. కానీ, బీజేపీ మాట కూడా మాట్లాడలేదు.

 

ఇక ఆ పార్టీ జాతీయ నేతలు కూడా అదే ధోరిణి అవలంభిస్తున్నారు. టీజేఏసీ టార్గెట్ చేస్తూ నిన్న  జాతీయ ప్రధాన కార్యదర్శి పి.మురళీధర్‌రావు ట్విటర్ లో వ్యాఖ్యలు చేశారు. జేఏసీని  హైజాక్‌ చేసేందుకు కోదండరాం ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు.

 

ముస్లిం రిజర్వేషన్ల అంశంపై హిందువులు, ముస్లింలుగా సమాజాన్ని విభజించడం బ్రిటిష్‌ రాచరికానికి తార్కాణమని, దాన్ని కాంగ్రెస్‌ పెంచి పోషించగా, ఇప్పుడు ఈ బృందంలోకి కోదండరాం కూడా వచ్చి చేరారని విమర్శించారు.

 

నోట్ల రద్దు తర్వాత ఏమైందో ఏమో కానీ కమలనాథులు తెలంగాణ లో  ‘కారు’ ను కాకుండా టీ జేఏసీనే టార్గెట్ చేసుకొని విమర్శలు ఎక్కుపెడుతున్నారు.

మొన్నటి వరకు తెలంగాణ బీజేపీ నేతలు ఈ పని చేసేవారు ఇప్పుడు ఆ పార్టీ జాతీయ నేతలు కూడా రంగంలోకి దిగారు.

Follow Us:
Download App:
  • android
  • ios