తన ప్రాణాలకు ముప్పు వుందని, రక్షణ కల్పించాలని కోరుతూ బీజేపీ నేత , మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంగళవారం తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 

తెలంగాణ బీజేపీ నేత , మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంగళవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనకు ప్రాణహానీ వుందని, రక్షణ కల్పించేలా పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలంటూ ఆయన హైకోర్టును కోరారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

కాగా.. గతేడాది కాంగ్రెస్‌ను వీడిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరారు. అనంతరం జరిగిన మునుగోడు ఉపఎన్నికలో ఆయన గట్టి పోటీ ఇచ్చినప్పటికీ.. బీఆర్ఎస్ అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఘన విజయం సాధించారు. దీంతో నాటి నుంచి కోమటిరెడ్డి సైలెంట్‌గా వుంటున్నారు. ఈ నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించడం ప్రాధాన్యత కలిగించింది.