రాష్ట్రమంతటా హుజూరాబాద్‌ ఫలితమే.. ఫామ్ హౌజ్ పక్కనున్న వారిని ఆదుకునే సోయిలేదా? : కేసీఆర్ పై ఈట‌ల ఫైర్

Siddipet: భారత రాష్ట్ర స‌మితి (బీఆర్ఎస్) అధినేత‌, ముఖ్య‌మంత్రి కే.చంద్ర‌శేఖ‌ర్ (కేసీఆర్)పై బీజేపీ నాయ‌కుడు ఈట‌ల రాజేంద‌ర్ తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. కొండపోచమ్మ సాగర్ నిర్వాసితులు అడ్డమీద కూలీలుగా మారుతున్నార‌ని ఆరోపించిన ఈట‌ల‌.. కేసీఆర్ కు ఫామ్ హౌజ్ పక్కన ఉన్న వారిని ఆదుకొనే సోయి లేదా? ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు ఎందుకు కల్పించడం లేదంటూ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. 
 

BJP leader Etela Rajender slams CM KCR RMA

BJP leader Etela Rajender slams CM KCR: ముఖ్య‌మంత్రి కే.చంద్ర‌శేఖ‌ర్ రావు (కేసీఆర్)పై బీజేపీ నాయ‌కుడు ఈట‌ల రాజేంద‌ర్ తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. కొండపోచమ్మ సాగర్ నిర్వాసితులు అడ్డమీద కూలీలుగా మారుతున్నార‌ని ఆరోపించిన ఈట‌ల‌.. కేసీఆర్ కు ఫామ్ హౌజ్ పక్కన ఉన్న వారిని ఆదుకొనే సోయి లేదా? ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు ఎందుకు కల్పించడం లేదంటూ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. 

వివ‌రాల్లోకెళ్తే.. ప్రజ్ఞాపూర్ హరిత హోటల్ దగ్గర ఆగిన సందర్భంగా మీడియాతో మాట్లాడిన భార‌తీయ జ‌న‌తా పార్టీ (బీజేపీ) నాయ‌కుడు, మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్.. సీఎం కేసీఆర్ పై ఘాటు విమ‌ర్శ‌లు గుప్పించారు. రాష్ట్ర అభివృద్ధికి ఎవ‌రూ అడ్డంకి కాద‌ని పేర్కొన్న ఈట‌ల..  కొండపోచమ్మ సాగర్ నిర్వాసితులు అడ్డమీద కూలీలుగా మారుతున్నార‌నీ, కేసీఆర్ కు ఫామ్ హౌజ్ పక్కన ఉన్న వారిని ఆదుకొనే సోయి లేదా? ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు ఎందుకు కల్పించడం లేదంటూ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు.

గెలిపించిన పాపానికి ఎన్నో సంవత్సరాల క్రితం ఇచ్చిన అసైన్డ్ భూములను గ్రోత్ కారిడార్ పేరుతో లాక్కుంటున్నాడనీ, మూడు కోట్ల రూపాయ‌ల విలువ చేసే భూములను గుంజుకుంటున్నార‌ని ఆరోపించారు. నమ్ముకొని ఓటు వేస్తే ఆశించిన బ్రతుకుల్లో మట్టి కొడుతున్నారని మండిప‌డ్డారు. ముఖ్య‌మంత్రి అసెంబ్లీ వేదికగా అసైన్డ్ భూములకు  హక్కులు కల్పిస్త అని చెప్పి.. అది చేయకపోగా ఉన్న భూములు లాక్కుంటున్నాడనీ, ఇది ఆయ‌న‌కు తగదని హెచ్చరించారు. డబుల్ బెడ్ రూం కోసం గజ్వేల్ లో 5 వేల అప్లికేషన్ ఇస్తే ఇప్పటి వరకు 1100 మందికి మాత్రం ఇళ్ళ కాగితాలు  ఇచ్చారు తప్ప ఇల్లు ఇవ్వలేదని ఆరోపించారు. "సొంత నియోజకవర్గం గొప్పగా ఉంది అని చెప్పుకుంటున్నారు కానీ లోతుగా పోతే ఎం చేస్తున్నారో.. ఈ ప్రజల బాధ ఏంటో అర్థం అవుతుంది. కూట్లో రాయి తీయలేని వాడు ఏట్లో రాయి తీయడానికి పోయినట్టుగా" ఉంద‌న్నారు.

"తెలంగాణ ప్రజలకు మేలు చెయ్యలేని వాడు.. మహారాష్ట్ర పోయి అబ్ కీ సర్కార్ కిసాన్ సర్కార్" అని మాయ మాటలు చెప్తున్నార‌ని మండిప‌డ్డారు. సీఎం కేసీఆర్ కు తెలంగాణ‌లోని స‌మ‌స్య‌లు క‌నిపించ‌డం లేదు.. క‌ళ్లు క‌నిపించ‌డం లేద‌ని అన్నారు. ఆయ‌న‌కు మెదడు పని చెయ్యడం లేదనీ, అధికారం నెత్తికి ఎక్కి కళ్ళు బైర్లు కమ్మి కనిపించడం లేదంటూ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. "నీకు ప్రజలు బయటపడడం లేదు. ఎన్నికల బ్యాలెట్ తెరిచినప్పుడు నీ సంగతి తెలుస్తుంది. మేము మాట్లాడితే సరి చేసుకొని ప్రయత్నం చెయ్యండి. మళ్లీ గెలుస్తాం అని నువ్వు క‌నే పగటి కలలు కల్లలేన‌ని" పేర్కొన్నారు. 

ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా హుజూరాబాద్ ఫలితమే తెలంగాణ అంతా పునరావృతం అవుతుందన్నారు. ప్రజలను పట్టించుకోకుంటే మట్టి కొట్టకుపోతారంటూ వ్యాఖ్యానించారు. ఆయ‌న భ‌ద్ర‌త‌కు సంబంధించిన ప్ర‌శ్న‌కు ఈట‌ల స్పందిస్తూ.. త‌న‌ను ప్ర‌జ‌లు కాపాడుకుంటార‌ని అన్నారు. వారిని హుజూరాబాద్ ప్రజలు ఓడించారని వారి మీద కక్ష తీర్చుకుంటున్నారనీ, అమాన‌క‌ర‌మైన అధికార‌పార్టీ బూతు పురాణానికి ముందు ముందు ఫుల్ స్టాప్ పెట్టాల‌నీ, ప్రజల భద్రత ప్రభుత్వ భాధ్యత అని తెలిపారు. 

జితేందర్ రెడ్డి ట్వీట్ గురించి ఆయ‌న్నే అడగండి.. 

బీజేపీ నాయ‌కుడు జితేందర్‌రెడ్డి చేసిన ట్వీట్ పై ఈటల మాట్లాడుతూ.. జితేందర్‌రెడ్డినే ఆ ట్వీట్ గురించి అడిగితేనే ఉద్దేశం తెలుస్తుంద‌న్నారు. వయసు, అనుభవం ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలనీ, ఏదీ పడితే అది మాట్లాడకూడదని అన్నారు. అలాగే, ఎవరి గౌరవంకు భంగం కలగకుండా చూసుకోవాల‌నీ, స్వేచ్ఛ, గౌరవం తగ్గించకూడదని తెలిపారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios