Asianet News TeluguAsianet News Telugu

పాదయాత్రకు సిద్దమైన ఈటల రాజేందర్... రూట్ మ్యాప్ ఖరారు

హుజురాబాద్ ఉపఎన్నికలో గెలుపే లక్ష్యంగా మాజీ మంత్రి ఈటల రాజేందర్ పావులు కదుపుతున్నారు. అందుకోసం ప్రజలకు మరింత దగ్గరయ్యేందుకు పాదయాత్రను అస్త్రంగా వాడుకుంటున్నారు. 

BJP Leader Eatela Rajender Announces Padayatra akp
Author
Huzurabad, First Published Jul 15, 2021, 10:18 AM IST

కరీంనగర్: కేంద్ర మంత్రివర్గం నుండి ఈటల రాజేందర్ బర్తరఫ్ తర్వాత తెలంగాణలో రాజకీయాలు వాడీవేడిగా సాగుతున్నాయి. ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా చేసి బిజెపిలో చేరడంతో ఆ రాజకీయ వేడి మరింత ముదిరింది. తన రాజీనామాతో హుజురాబాద్ లో ఉపఎన్నిక ఖాయమవడంతో ఇకపై నియోజకవర్గ ప్రజల మధ్యలోనే వుండాలని ఈటల నిర్ణయించుకున్నారు. అందుకోసం పాదయాత్రనే అస్త్రంగా వాడుకోవాలని చూస్తున్నారు.  

హుజురాబాద్ నియోజకవర్గంలో  ఈటల పాదయాత్ర ఖరారయ్యింది. నియోజకర్గ పరధిలోని ప్రతి గ్రామాన్ని కవర్ చేసేలా ఆయన పాదయాత్ర సాగనుంది. ఇందుకు సంబంధించిన రూట్ మ్యాప్ కూడా ఇప్పటికే ఖరారయ్యింది. ఉప ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే ప్రతి గ్రామానికి వెళ్ళాలని ఈటల భావిస్తున్నారు. దీంతో హుజురాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీలతో పాటుగా 126 గ్రామాల మీదుగా పాదయాత్ర చేయనున్నారు.  

read more  హుజురాబాద్‌లో ఈటలదే గెలుపు.. సర్వేల నివేదిక ఇదే: బండి సంజయ్

ప్రతిరోజు నాలుగైదు గ్రామాలలో పర్యటించి రాత్రి ఏదో ఒక గ్రామంలో బస చేసేలా ప్రణాళిక రూపొందించారు. ఈ పాదయాత్ర ఈనెల 16 లేదా 17 తేదీలలో ప్రారంభించే అవకాశముంది. తనకి సెంటిమెంట్ అయిన కమలాపూర్ మండలంలోని గోపాలపురం, బత్తురొనిపల్లి నుండి పాదయాత్రకి శ్రీకారం చుట్టనున్నారు ఈటల.  

హుజురాబాద్ నియోజకవర్గం మొత్తాన్ని చుట్టివచ్చేలా సాగనున్న ఈటల పాదయాత్ర దాదాపు 22 రోజుల పాటు కొనసాగనుంది. చివరగా జమ్మికుంటలో భారీ బహిరంగ సభతో ఈటల రాజేందర్ పాదయాత్ర ముగియనుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios