కేసీఆర్ ఆరోగ్యంపై అనుమానాలు. సీఎం కావాలని పెద్దాయనను నిర్లక్ష్యం చేయొద్దు : కేటీఆర్‌పై డీకే అరుణ వ్యాఖ్యలు
బీజేపీ నేత, మాజీ మంత్రి డీకే అరుణ సైతం కేసీఆర్ ఆరోగ్యంపై అనుమానాలు వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ , కాంగ్రెస్ మధ్య లోపాయికారి ఒప్పందం వుందని, పెద్దాయనను ఫాంహౌస్‌లో పడుకోబెట్టి కేటీఆర్, హరీష్‌లు పరుగులు పెడుతున్నారని అరుణ సంచలన వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గత మూడు వారాలుగా ప్రజలకు కనిపించడం లేదు. ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారని కుటుంబసభ్యులు చెబుతున్నప్పటికీ.. విపక్ష నేతలు మాత్రం అనుమానాల వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ బీజేపీ బండి సంజయ్ అయితే ఏకంగా కేటీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌ను కేటీఆర్ ఇబ్బంది పెడుతున్నారని.. సంతోష్ కుమార్‌ను కూడా దూరం పెడుతున్నారని, మా ముఖ్యమంత్రిని ఒక్కసారి చూపించాలంటూ సంజయ్ డిమాండ్ చేశారు. తాజాగా మరో బీజేపీ నేత, మాజీ మంత్రి డీకే అరుణ సైతం కేసీఆర్ ఆరోగ్యంపై అనుమానాలు వ్యక్తం చేశారు.
శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కావాలన్న ఆత్రుతతో కేసీఆర్‌ను నిర్లక్ష్యం చేయొద్దన్నారు. ఆయన ఆరోగ్యంపై జాగ్రత్త తీసుకోవాలని.. బావ బావమరుదులు పనులు పూర్తికాకుండా తెల్లసున్నాలు వేసి ప్రారంభోత్సవాలు చేస్తున్నారని అరుణ ఆరోపించారు. తండ్రి ఆరోగ్యంపై ఆందోళన లేకుండా.. సీఎం కావాలనే ఆరాటంలోనే కేటీఆర్ వున్నారని డీకే అరుణ దుయ్యబట్టారు. దొంగ నోటిఫికేషన్లతో పేపర్లు లీక్ చేసి నిరుద్యోగులను మోసం చేశారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ , కాంగ్రెస్ మధ్య లోపాయికారి ఒప్పందం వుందని, పెద్దాయనను ఫాంహౌస్‌లో పడుకోబెట్టి కేటీఆర్, హరీష్‌లు పరుగులు పెడుతున్నారని అరుణ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ALso Read: కేసీఆర్ ఎక్కడ : సీఎం ఆరోగ్యంపై వదంతులు, కేటీఆర్ క్లారిటీ.. టైం పడుతుందంటూ కామెంట్స్
కేసీఆర్ ఆరోగ్యంపై వదంతుల నేపథ్యంలో మంత్రి కేటీఆర్ స్పందించారు. శుక్రవారం ఓ జాతీయ మీడియా సంస్థ ప్రతినిధితో ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రికి ఛాతీలో సెకండరీ ఇన్‌ఫెక్షన్ వచ్చిందని.. కొద్దిరోజుల క్రితం వైరల్ ఫీవర్, ఇప్పుడు బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్ రావడంతో కోలుకోవడానికి టైం పడుతుందని కేటీఆర్ స్పష్టం చేశారు. కాగా.. వైరల్ ఫీవర్ కారణంగా సీఎం కేసీఆర్ గత 3 వారాలుగా రాష్ట్ర ప్రజలకు దూరంగా వుంటున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ స్పందించారు. ముఖ్యమంత్రికి ఛాతీలో సెకండరీ ఇన్‌ఫెక్షన్ వచ్చిందని.. కొద్దిరోజుల క్రితం వైరల్ ఫీవర్, ఇప్పుడు బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్ రావడంతో కోలుకోవడానికి టైం పడుతుందని కేటీఆర్ స్పష్టం చేశారు. కాగా.. వైరల్ ఫీవర్ కారణంగా సీఎం కేసీఆర్ గత 3 వారాలుగా రాష్ట్ర ప్రజలకు దూరంగా వుంటున్న సంగతి తెలిసిందే.