PM Modi Telangana visit: ప్రధాని నరేంద్ర మోడీ నేడు హైదరాబద్ కు రానున్నారు. అయితే, మోడీ పర్యటనలో ప్రొటోకాల్ ఉల్లంఘించారనే నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.
Telangana: నేడు ప్రధాని నరేంద్ర మోడీ హైదారాబాద్ లో పర్యటించనున్నారు. ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు (కేసీఆర్) జాతీయ రాజకీయాలపై దృష్టి సారించి.. వివిధ రాష్ట్రాల నేతలో సంప్రదింపులు.. చర్చలు జరుపుతున్నారు. దీనిలో భాగంగా ఆయన ఈ నెల 26న బెంగళూరుకు వెళ్లనున్నారు. అయితే, గురువారం నాడు ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో ఉండరని వార్తలు రావడంతో భారతీయ జనతా పార్టీ కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది. ప్రధాని రాక నేపథ్యంలో సీఎం కేసీఆర్ ప్రోటోకాల్ ను ఉల్లంఘిస్తున్నారంటూ మండిపడింది. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ISB)లో జరిగే 20వ వార్షిక వేడుకలకు హాజరయ్యేందుకు ప్రధాని గురువారం హైదరాబాద్‌కు రానున్నారు. అయితే, మందస్తు ప్రణాళికలు ఉన్నందున సీఎం ప్రధానిని కలవకపోవచ్చునని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
"తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్ గతంలో జాతీయ రాజకీయాల పేరుతో నాలుగు నెలల వ్యవధిలో రెండవసారి ప్రోటోకాల్‌ను దాటవేసే అవకాశం ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రధాని హైదరాబాద్ పర్యటనకు కేసీఆర్ గైర్హాజరయ్యారు" అని బీజేపీ శ్రేణులు పేర్కొంటున్నాయి. BJP OBC మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ K లక్ష్మణ్ మాట్లాడుతూ "PM మోడీ హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలోని ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ప్రైవేట్ ప్రోగ్రామ్ కోసం రానున్నారు. బేగంపేట విమానాశ్రయంలో బీజేపీ రాష్ట్ర విభాగం ఆయనకు సన్మానం చేయనుంది. రాష్ట్ర పర్యటనలో ప్రధానికి స్వాగతం పలుకుతూ ఆయనను రిసీవ్ చేసుకోవడం ముఖ్యమంత్రి కర్తవ్యం" అని ఆయన అన్నారు.
"ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వంతో, మరీ ముఖ్యంగా కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నందున ప్రధానమంత్రిని స్వీకరించే కనీస మర్యాదను పాటించడం లేదని తెలంగాణ ప్రజలు విసుగు చెందుతున్నారు. ఇది మొదటిసారి కాదు రెండోసారి.. ఈ సమయంలో కేసీఆర్ ఇతర రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారని, తెలంగాణ ప్రజలు ఆయన్ను చూసి నవ్వుకుంటున్నారు" అని పేర్కొన్నారు.
“ఇది వ్యవస్థ కాదు, కానీ ముఖ్యమంత్రి ఆ విధంగా వ్యవహరిస్తారు. రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా విమానాశ్రయంలో ఆయనకు స్వాగతం పలకడం ముఖ్యమంత్రి కర్తవ్యమని, ప్రోటోకాల్‌ను పాటించాలన్నారు. ప్రధాన కార్యదర్శిని తప్ప మరే ఇతర మంత్రి కూడా ప్రధానిని స్వీకరించడానికి రావడం లేదని మాకు చెప్పారని” అని లక్ష్మణ్ తెలిపారు. కాగా, విమానాశ్రయంలో పార్టీ కార్యకర్తలు ప్రధానమంత్రికి స్వాగతం పలకడానికి ఎంతో ఉత్సాహంగా ఉన్నారని తెలిపారు.
కాగా, మధ్యాహ్నం 1.30 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరకుంటారు. బేగంపేట ఎయిర్‌పోర్టులో ప్రధాని మోదీకి తెలంగాణ ప్రభుత్వం తరఫున రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వాగతం పలకనున్నారు. మధ్యాహ్నం 1.45 గంటల వరకు ఎయిర్ పోర్టు పార్కింగ్ లో రాష్ట్ర బీజేపీ నేతలతో సమావేశమవుతారు. అనంతరం అక్కడి నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చేరుకుంది. అక్కడ దిగిన తర్వాత రోడ్డుమార్గంలో గచ్చిబౌలి ఐఎస్బీకి చేరుకుంటారు. మధ్యాహ్నం 2 నుంచి 3.15 గంటల మధ్య ఐఎస్‌బీ వార్షికోత్సవంలో పాల్గొంటారు. సాయంత్రం 4 గంటలకు తిరిగి బేగంపేటకు మోదీ చేరుకుంటారు. సాయంత్రం 4 .15 గంటలకు బేగంపేట్ నుండి చెన్నైకి వెళ్తారు.
