Asianet News TeluguAsianet News Telugu

ఎవనికి పుట్టింది అని అంటివిగా

  • కేజీ పిజి ఉచిత విద్య ఎటుపోయింది
  • కార్పొరేట్ కాలేజీలతో కుమ్మక్కయ్యారు
  • క్షమాపణ చెప్పిన తర్వాతే తెలుగు సభలకు పోవాలి
BJP Indrasena attacks KCRs somersault on Telugu Talli and Telugu language

గతంలో తెలుగుతల్లి గురించి కేసిఆర్ మాట్లాడిన విషయాన్ని తాజాగా గుర్తు చేశారు బిజెపి ఉమ్మడి రాష్ట్ర మాజీ అధ్యక్షులు నల్లు ఇంద్రసేనారెడ్డి. అప్పట్లో ఎవనికి పుట్టిన తెలుగు తల్లి అని మాట్లాడి ఇప్పుడు అంగరంగ వైభవంగా తెలుగు మహాసభలు చేయడం ఆశ్చర్యంగా ఉందన్నారు. కేసిఆర్ కు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఎవనికి పుట్టిన తెలుగుతల్లి అన్న మాటలకు క్షమాపణ చెప్పిన తర్వాతే తెలుగు మహాసభలకు కేసిఆర్ పోవాలని డిమాండ్ చేశారు. ఇంకా అనేక అంశాలను నల్లు ఇంద్రసేనారెడ్డి లేవనెత్తారు. ఆ మాటలు చదవండి.

కేజీ టు పీజీ ఉచిత విద్య అందరికి అన్న కేసీఆర్ .. ప్రైవేట్ కళాశాల ల తో.. కుమ్మక్కై ఫీజు ల రూపం లో దోచుకుంటున్నాడు. ఫీజు వసూళ్ల మీద రిటైర్డ్ జడ్జ్ తో  రెగ్యులేటరీ కమిటీ వేశారు. కానీ పలుకుబడి ఉన్న కాలేజీల యాజమాన్యాలకు ప్రభుత్వం లొంగిపోయింది.. కోర్ట్ లో కూడా ప్రైవేటు కాలేజ్ ల కు అనుకూలంగా తీర్పు వచ్చేట్టు ప్రభుత్వం కావాలని ఓడిపోయింది. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే.. విద్యార్థులు తమ విలువైన జీవితాలు కోల్పోతున్నారు.

బీ కేటగిరి సీట్ల ను కూడా ఎందుకు కౌన్సెలింగ్ లో నింపడం లేదు.. సీఎం ఆఫీస్ నుండి ఫోన్ వెళ్లడం ద్వారానే.. కుమ్మక్కై ..పేద విద్యార్థుల ను మోసం చేస్తున్నారు. ప్రభుత్వం పర్మినెంట్ అనుకొని కొత్తగా వచ్చిన వారు.. భయపెట్టి, మభ్యపెట్టి.. బెదిరించి తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు.

సమగ్ర కుటుంబ సర్వే ఏమైంది? కొత్త జిల్లాలు, కొత్త మండలాల వల్ల ఏం సాధించారు? సర్పంచ్ ల ను పక్కనపెట్టి రైతు సంఘాల పేరుతో రాజకీయం తమ గుప్పిట్లో పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. పంచాయతీ రాజ్ చట్టం మార్పు పేరు మీద ..సర్పంచ్ ల ను తమ గుప్పిట్లో పెట్టుకోవడం కోసం పరోక్ష ఎన్నికల కు వెళ్తోంది కేసిఆర్ సర్కారు.

వ్యవస్థ ల ని తన గుప్పిట్లో కి తీసుకోవడం ద్వారా నియంతగా మారే ప్రయత్నం చేస్తున్నాడు కేసీఆర్. సీఎం కేసీఆర్ కు తెలుగు భాష మీద, మహాసభ ల మీద ప్రేమ లేదు..పూట పూట కు తన కోసం మాటలు మారుస్తాడు. గతం లో  ఎవనికి పుట్టిన తెలుగు తల్లి అని నీచంగా మాట్లాడారు... క్షమాపణ చెప్పిన తరువాత .. సభ ల కు వెళ్ళాలి.

Follow Us:
Download App:
  • android
  • ios