Khammam: ఖమ్మంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నిర్వహించిన 'రైతు గోసా, బీజేపీ భరోసా' బహిరంగ సభ తెలంగాణ రైతాంగానికి కొన్ని హామీలు ఇవ్వడానికి ఉద్దేశించింది కాగా, ముఖ్య అతిథిగా విచ్చేసిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా తన ప్రసంగంలో ఎక్కువ భాగం భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్), ఎంఐఎం మధ్య బంధం, ఆయా పార్టీలపై విమర్శలు గుప్పించడానికి కేటాయించారు.
Union home minister Amit Shah: దేశంలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చింది బీజేపీ అని కేంద్ర హోం మంత్రి అమిత్ అన్నారు. ఖమ్మంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నిర్వహించిన 'రైతు గోసా, బీజేపీ భరోసా' బహిరంగ సభ తెలంగాణ రైతాంగానికి కొన్ని హామీలు ఇవ్వడానికి ఉద్దేశించింది కాగా, ముఖ్య అతిథిగా విచ్చేసిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా తన ప్రసంగంలో ఎక్కువ భాగం భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్), ఎంఐఎం మధ్య బంధం, ఆయా పార్టీలపై విమర్శలు గుప్పించడానికి కేటాయించారు.
వివరాల్లోకెళ్తే.. ఖమ్మంలో బీజేపీ నిర్వహించిన రైతు గోసా బీజేపీ భరోసా బహిరంగ సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతూ అధికార బీఆర్ఎస్ పార్టీ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇదే సమయంలో రైతాంగం గురించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. వ్యవసాయాన్ని బీజేపీ లాభసాటిగా మార్చిందని షా అన్నారు. కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం వ్యవసాయానికి బడ్జెట్ కేటాయింపులను రూ .22,000 కోట్ల నుండి (యూపీఏ పాలనలో) రూ.1.28 లక్షల కోట్లకు పెంచిందనీ, దీంతో వ్యవసాయ రంగం లాభసాటిగా మారిందన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రూ.7 లక్షల కోట్ల రుణాలు, సబ్సిడీలు మాత్రమే ఇచ్చిందని, బీజేపీ రూ.20 లక్షల కోట్లు ఇచ్చిందన్నారు. కాంగ్రెస్ హయాంలో కేవలం 475 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని మాత్రమే సేకరించారు. ప్రధాని మోడీ పాలనలో ఈ సంఖ్య 900 లక్షల మెట్రిక్ టన్నులకు చేరుకుందని అమిత్ షా అన్నారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేసీఆర్ రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. కిసాన్ సమృద్ధి నిధి పథకం కింద కేంద్రం 2 లక్షల మంది రైతులకు రూ.6.11 లక్షల కోట్లు అందిస్తోందన్నారు. మోడీ ప్రభుత్వం 10,000 ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ (ఎఫ్ పీఓ)లను ఏర్పాటు చేస్తోందన్నారు.
ఆగస్టు 26న చేవెళ్ల సమావేశంలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే బీఆర్‌ఎస్, బీజేపీల మధ్య రహస్య స్నేహం ఉందన్న ఆరోపణలపై స్పందిస్తూ.. ‘కేసీఆర్, అసదుద్దీన్ ఒవైసీలతో కాషాయ పార్టీ ఎప్పటికీ ఏకం కాదనీ, వారికి వ్యతిరేకంగా పోరాడుతుందని’ అన్నారు. రాబోయే ఎన్నికల తర్వాత కాషాయ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేసిన అమిత్ షా, తెలంగాణ యువత బీఆర్ఎస్ కోసం, రజాకార్ల నేతృత్వంలోని పార్టీ కోసం తమ ప్రాణాలను త్యాగం చేయలేదని అన్నారు. అలాగే, కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎంలు వారసత్వ రాజకీయాలకు పాల్పడుతున్నాయని విమర్శించారు.
