Asianet News TeluguAsianet News Telugu

పోడు రైతుల్ని మోసం చేసిన కేసీఆర్.. వారికి మద్దతుగా బీజేపీ పోరాటం.. బండి సంజయ్...

గచ్చిబౌలిలోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన ఎస్టీ అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన బీజేపీ సమన్వయకర్తల సమావేశంలో బండి సంజయ్ మాట్లాడారు. రాష్ట్రంలో టిఆర్ఎస్ కు బీజేపీనే ప్రత్యామ్నాయం అని పునరుద్ఘాటించారు. జాతీయ నాయకత్వం రాష్ట్ర పార్టీకి అండగా ఉంటుందని తెలిపారు. 

BJP fights in support of Podu farmers say Bandi Sanjay
Author
Hyderabad, First Published Jan 19, 2022, 2:12 PM IST

హైదరాబాద్ : పోడు రైతులకు మద్దతుగా BJP పోరాటం చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ముఖ్యమంత్రి KCR పోడు భూములకు పట్టాలు ఇస్తానని చెప్పి విస్మరించారని ధ్వజ మెత్తారు. రాష్ట్రంలోని 12 ఎస్టీ నియోజకవర్గాల్లో రాబోయే ఎన్నికల్లో బిజెపి విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు.

గచ్చిబౌలిలోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన ST Assembly constituenciesకు చెందిన బీజేపీ సమన్వయకర్తల సమావేశంలో బండి సంజయ్ మాట్లాడారు. రాష్ట్రంలో టిఆర్ఎస్ కు బీజేపీనే ప్రత్యామ్నాయం అని పునరుద్ఘాటించారు. జాతీయ నాయకత్వం రాష్ట్ర పార్టీకి అండగా ఉంటుందని తెలిపారు. గుర్రంపోడులో ST Morcha నేతలపై లాఠీఛార్జి చేశారని మండిపడ్డారు. 12 ఎస్టీ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి, స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, రాబోయే ఎన్నికల్లో ఆయా స్థానాల్లో బీజేపీ విజయానికి చేపట్టాల్సిన కార్యాచరణపై ఈ సమావేశంలో నేతలు చర్చించారు. కార్యక్రమంలో ఆదిలాబాద్ ఎంపీ సోయం బాబూరావు, మాజీ మంత్రి రవీంద్ర నాయక్ తదితరులు పాల్గొన్నారు,

ఇదిలా ఉండగా, హైదరాబాద్ Bjpలో కొందరు సీనియర్లు secret సమావేశాలు నిర్వహించడంపై ఆ పార్టీ నాయకత్వం ఆరా తీసింది. రహస్య సమావేశాలు నిర్వహించిన కొందరు నేతలపై పార్టీ నాయకత్వం చర్యలు తీసుకొనే అవకాశం ఉందని సమాచారం.పార్టీలో కొత్తగా వచ్చిన వారు తమను ఎదగనీయకుండా తొక్కేస్తున్నారనే అసంతృప్తితో ఉన్న నేతలంతా రహస్య సమావేశాలు నిర్వహించారు. 

రాష్ట్రంలోని పలు జిల్లాలకు చెందిన 17 మంది నేతలు ఈ రహస్య సమావేశాలు నిర్వహించారని సమాచారం. మాజీ ఎమ్మెల్యేలు గుజ్జుల రామకృష్ణారెడ్డి, ధర్మారావులతో పాటు ఆ పార్టీ నేతలు సుగుణాకర్ రావు, రాజేశ్వరరావు, నాగూరావు నామోజీ, మల్లారెడ్డి, శ్రీనివాస్, చింతా సాంబమూర్తి తదితరులు ఈ రహస్య సమావేశాల్లో పాల్గొన్నారు. రహస్య సమావేశాలతో పాటు జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహించారని సమాచారం. కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో కూడా సమావేశాలు నిర్వహించినట్టుగా తెలుస్తోంది.

రహస్య సమావేశాలపై పార్టీ నాయకత్వం అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఈ విషయమై పార్టీ నాయకత్వం ఆరా తీసింది. మాజీ కేంద్ర మంత్రి Kishan Reddyతో కూడా అసంతృప్తి నేతలు సమావేశమయ్యారని సమాచారం. ఈ విషయమై ఆరా తీసిన పార్టీ నాయకత్వం కొందరు నేతలకు పార్టీ కమిటీల్లో చోటు కల్పించారు.  చింతా సాంబమూర్తి, రాజేశ్వరరావు లకు కమిటీల్లో చోటు కల్పించి వారిని బుజ్జగించే ప్రయత్నం చేశారు.

మరో వైపు బీజేపీ నేతల రహస్య సమావేశంపై మాజీ ఎమ్మెల్యే నల్లు ఇంద్రసేనారెడ్డికి అప్పజెప్పింది. కరీంనగర్ జిల్లాలో సమావేశాలు ఏర్పాటు చేసిన నేతలు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. అయితే  ఈ విషయమై ఇంద్రసేనారెడ్డి  రహస్య సమావేశాలు నిర్వహించిన నేతలతో చర్చించినట్టుగా తెలుస్తోంది.   ఈ సమావేశాలపై ఇంద్రసేనారెడ్డి సమాచారాన్ని సేకరించి పార్టీ నాయకత్వానికి అందించనున్నారు. ఈ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకొనే అవకాశం ఉంది. 

Follow Us:
Download App:
  • android
  • ios