హైద్రాబాద్ జలమండలి :బీజేపీ కార్పోరేటర్ల మెరుపు ధర్నా

హైద్రాబాద్ జలమండలి కార్యాలయం ముందు  ఇవాళ  బీజేపీ  కార్పోరేటర్లు  ఆందోళనకు దిగారు.  మంచినీరు  మురుగు నీరు  వస్తున్నాయని  బీజేపీ కార్పోరేటర్లు ఆందోళనకు దిగారు

 BJP  corporators holds protest  at  hmwssb  office in Hyderabad  lns


హైదరాబాద్:జలమండలి  కార్యాలయం ముందు  మంగళవారంనాడు  బీజేపీ కార్పోరేటర్లు  ధర్నాకు దిగారు. బీజేపీ కార్పోరేటర్లు మెరుపు ఆందోళనకు దిగారు. .   వర్షా కాలం ప్రారంభం కాకముందే   అకాల వర్షాలకు  డ్రైనీజీలు  పొంగిపొర్లుతున్నాయని బీజేపీ కార్పోరేటర్లు  ఆరోపిస్తున్నారు. డ్రైనేజీ నీళ్లు,  మంచీనీరు కలిసి  సరఫరా అవుతున్నందున  ప్రజలు  అస్వస్థతకు గురౌతున్నారని  బీజేపీ నేతలు  ఆరోపించారు. ఇటీవల సికింద్రాబాద్ లో  జరిగిన ఘటనను  బీజేపీ  కార్పోరేటర్లు  గుర్తు  చేస్తున్నారు. 

జీహెచ్ఎంసీ పరిధిలో  చోటు  చేసుకున్న  సమస్యలను  జలమండలి ఉన్నతాధికారలకు  ఫిర్యాదు  చేసేందుకు  తాము  వస్తే పోలీసులు అడ్డుకున్నారని బీజేపీ కార్పోరేటర్లు ఆరోపిస్తున్నారు. బీజేపీ కార్పోరేటర్లు జలమండలి కార్యాలయం ముందు బైఠాయించారు.  ఏళ్ల తరబడి  సమస్యలు పెండింగ్ లో ఉన్నాయని బీజేపీ కార్పోరేటర్లు  ఆరోపిస్తున్నారు.  ఈ సమస్యలను పరిష్కరించడంలో   అధికారులు వైఫల్యం  చెందారని బీజేపీ  నేతలు  ఆరోపించారు. జలమండలి కార్యాలయం ముందు  ధర్నాకు దిగిన  బీజేపీ కార్పోరేటర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios