హైదరాబాద్‌లో ఓ సినిమా షూటింగ్‌ను బీజేపీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి అడ్డుకునేందుకు యత్నించారు. నగరంలోని సరూర్‌నగర్‌లోని విక్టోరియా స్కూల్‌లో రామ్ చరణ్- శంకర్ సినిమా షూటింగ్‌‌కు అనుమతివ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. 

హైదరాబాద్‌లో ఓ సినిమా షూటింగ్‌ను బీజేపీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి అడ్డుకునేందుకు యత్నించారు. నగరంలోని సరూర్‌నగర్‌లోని విక్టోరియా స్కూల్‌లో రామ్ చరణ్- శంకర్ సినిమా షూటింగ్‌‌కు అనుమతివ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. స్కూల్స్‌ను షూటింగ్‌కు ఎలా అనుమతిస్తారని ఆకుల శ్రీవాణి ప్రశ్నించారు. సినిమా షూటింగ్ వల్ల విద్యార్థుల క్లాస్‌లకు ఇబ్బంది కలుగుతుందన్నారు. సినిమా షూటింగ్ ఆపాలని ఆందోళనకు దిగారు. ‘‘విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి విద్యా వద్దు.. సినిమా షూటింగ్లు ముద్దు’’ అని నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి మాట్లాడుతూ.. సినిమా షూటింగ్ కోసం రూ. 4 కోట్లు రూపాయలు మంజూరు చేసి వీఎం హోమ్ మరమత్తు పనులు చేయిస్తున్నారని మండిపడ్డారు. రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్‌లో సినిమాకు షూటింగ్‌లో షాట్స్ బాగా రావడం లేదని సబితా హుటాహుటిన నిధులు మంజూరు చేశారని ఆరోపించారు. 

‘‘మహేశ్వరం అసెంబ్లీ నియోజవర్గం పరిధిలోని సరూర్ నగర్ డివిషన్‌లో ఒకటే గదిలో ఐదు తరగతుల పిల్లలకు పాఠాలు చెబుతున్న విద్యాలయాలు, నిత్యం పొంగుతున్న డ్రైనేజీ పైపులు, గుంతలతో ఉన్న రోడ్లు, వీఎం హోమ్ పందులకు, గంజా ,డ్రగ్స్ అసాంఘిక కార్యక్రమాల అడ్డగా మారిన సబిత ఇంద్రా రెడ్డికి ఇవన్నీ ఏవి కనపడవు’’ అని ఆకుల శ్రీవాణి మండిపడ్డారు.