Warangal: తెలంగాణలో అభివృద్ధిని అడ్డుకునేందుకు బీజేపీ కుట్ర చేస్తోంద‌ని ప్రముఖ గాయకుడు దేశపతి శ్రీనివాస్ అన్నారు. మంగళవారం హనుమకొండలోని కాళోజీ సెంటర్ లో చీఫ్ విప్ డి.వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో నిర్వహించిన దీక్షా దివస్ సంద‌ర్భంగా ఆయ‌న పై వ్యాఖ్య‌లు చేశారు.  

Singer Deshapathi Srinivas: తెలంగాణలో విధ్వంసక రాజకీయాల ద్వారా అభివృద్ధిని అడ్డుకునేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని ప్రముఖ కవి, గాయకుడు దేశపతి శ్రీనివాస్‌ మంగళవారం ఆరోపించారు. మంగళవారం ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ లో ఉన్న‌ హనుమకొండలోని కాళోజీ సెంటర్ లో చీఫ్ విప్ డి.వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో నిర్వహించిన దీక్షా దివస్ సంద‌ర్భంగా ఆయ‌న పై వ్యాఖ్య‌లు చేశారు. 2009 నవంబర్ 29న రాష్ట్ర విభజనకు మార్గం సుగమం చేసిన టీఆర్‌ఎస్ అధినేత కే చంద్రశేఖర్ రావు (కేసీఆర్) చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను పురస్కరించుకుని ప్రతి ఏటా దీక్షా దివస్‌ను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

తెలంగాణలో అభివృద్ధిని అడ్డుకునేందుకు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతున్నదనీ, అయితే, ఆ పార్టీకి అది కలగానే మిగిలిపోతుందనీ, బీజేపీ విభజన రాజకీయాలు తెలంగాణ ప్రజలకు తెలుసునని ప్ర‌ముగ సింగ‌ర్ దేశ‌ప‌తి శ్రీనివాస్ అన్నారు. 2009లో కేసీఆర్ 'ఆమరణ నిరాహార దీక్ష'కు దారితీసిన సంఘటనలను దేశపతి ప్రస్తావిస్తూ, ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను బలపరుస్తూ తెలంగాణ మొత్తాన్ని ఏకం చేశారన్నారు. ప్రత్యేక తెలంగాణ కోసం జరిగిన పోరాటంలో వినయ్ భాస్కర్ చేసిన కృషిని దేశపతి గుర్తు చేసుకున్నారు. వరంగల్ లో ముందు నుంచి వినయ్ నాయకత్వం వహించారనీ, ఆందోళనలో కేసీఆర్‌కు మద్దతుగా నిలిచారని తెలిపారు.

ప్రత్యేక తెలంగాణపై మక్కువను రగిలించిన కవి కాళోజీ నారాయణరావు, కవి దాశరథి, ప్రొఫెసర్ జయశంకర్ పాత్రలను కూడా దేశపతి గుర్తు చేసుకున్నారు. ఈ ప్రాంతంలోని ప్రజలకు కాకతీయుల ధీరత్వం, సమ్మక్క సారలమ్మ దిట్ట అని అన్నారు. ఈ సందర్భంగా వినయ్ మాట్లాడుతూ.. తాను ఎప్పుడూ కేసీఆర్‌ నుంచి స్ఫూర్తి పొందుతానన్నారు. తెలంగాణ ఉద్యమం, ఆ తర్వాత త‌న‌కు ఎల్లప్పుడూ మద్దతుగా నిలిచిన త‌న క్యాడర్‌కు ధన్యవాదాలు తెలిపారు. కేసీఆర్ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష తెలంగాణ చరిత్రలో ఒక ఒక ప్ర‌త్యేక ఘ‌ట్టంగా నిలిచింద‌ని అన్నారు. 

ఆర్థిక విశ్లేషకుడు ప్రొఫెసర్ డీ పాపారావు మాట్లాడుతూ.. ఆంధ్రా ప్రాంతానికి చెందినా తెలంగాణకు మద్దతిచ్చాననీ, ప్రత్యేక తెలంగాణ సాధనకు గాంధేయ మార్గాన్ని ప్రజలు అనుసరించారని చెప్పడం విస్మయం కలిగిస్తోందన్నారు. కేంద్రం పలు ప్రభుత్వ రంగ యూనిట్లను (పీఎస్‌యూ) ప్రైవేటీకరించిందని విమర్శించారు. గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి, కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ ఖాన్, మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కాగా, ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు డిమాండ్‌తో టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు (కేసీార్) ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన నవంబర్ 29న దీక్షా దివస్ గా జరుపుకుంటున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీ రామారావు (కేటీఆర్) మంగళవారం అప్పటి క్ష‌ణాల‌ను గుర్తు చేసుకున్నారు. ఆనాటి సంఘటనలను గుర్తు చేస్తూ కేసీఆర్‌ చేసిన పోరాటం ఎప్పటికీ మరువలేనిదని, తెలంగాణ ప్రజల కలను సాకారం చేసిన దీక్షా దివస్‌ తెలంగాణ చరిత్రలో చిరస్మరణీయమైన రోజని అన్నారు. దేశం దృష్టి తెలంగాణ వైపు మళ్లిన రోజు అని కేటీఆర్ అన్నారు.